News


పన్ను రేట్ల తగ్గింపు...వృద్ధి పెంపుపై దృష్టి: ఆర్థిక మంత్రి సీతారామన్‌

Saturday 7th December 2019
news_main1575716673.png-30111

కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రణాళికల్లో  భాగంగా ‘‘పన్ను రేట్ల తగ్గింపు’’ ప్రతిపాదన పై కూడా ఆలోచనలు చేస్తున్నటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో శనివారం సీతారామన్ వివిధ ఆర్థిక సమస్యలపై స్పందించారు. పన్నుల వ్యవస్థను మరింత సులభం చేయడంతో పాటు ఎలాంటి వేధింపులు లేకుండా చేస్తామని తెలిపారు. మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే దిశగా ఉద్దీపన అంశాలపై ఆర్థికవేత్తల సలహాలను వింటున్నామన్నారు. జీఎస్‌టీపై ఆందోళన ప్రస్తావిస్తూ ‘‘మంచి చట్టం-భారతదేశానికి అవసరమని, ప్రతి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ జీఎస్టీ రేట్లను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని  తెలిపారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందే అంశాన్ని ప్రస్తావిస్తూ ‘‘ గృహ సముదాయాల నిర్మాణం, బీమా, హెల్త్‌కేర్‌, పర్యావరణ రంగాల్లో వృద్ధి జరిగినప్పడే మాత్రమే ఇది సాధ్యమవుతుందన్నారు. అలాగే నైపుణ్య ఆధారిత ఉద్యోగాలపై దృష్టి పెడతామని ఆమె అన్నారు. ఆర్థిక మందగమనం అంశంపై స్పందిస్తూ ‘‘మందగమనం కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం అయ్యింది. మరికొన్ని రోజుల్లో రికవరీ సాధ్యం అవుతుంది. అయితే కొన్ని రంగాలకు కొంత సహాయం అందించాల్సిన అవసరం ఉంది. నా దృష్టి ఎక్కువ ఉద్దీపనపై ఉంది.’’ సీతారామన్‌ అన్నారు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) పరిస్థితి గురించి మాట్లాడుతూ శిఖరాగ్రాల నుంచి పతనం ఎవరూ కోరుకోరు. నిధులు ఎన్‌బీఎఫ్‌సీలకు అందేలా చూసుకుంటామని ఆర్థికమంత్రి తెలిపారు. 



You may be interested

ఈ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజీలు సానుకూలం

Sunday 8th December 2019

ఇండెక్స్‌లో ప్రధాన స్టాక్స్‌ విలువలు అధిక స్థాయికి చేరిపోవడం, దేశ జీడీపీ వృద్ధి కనిష్ట స్థాయికి చేరడం, అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌ ఆలస్యమవ్వచ్చన్న అంశాలు... మన మార్కెట్లకు గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 12 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 4 శాతం, 9 శాతం చొప్పున నష్టపోయాయి. విలువల పరంగా చూస్తే సెన్సెక్స్‌

అమెరికా మార్కెట్‌ జోరు... టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ డౌన్‌

Saturday 7th December 2019

అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటర్స్‌ అత్యధికంగా 1.81శాతం నష్టపోయింది. విప్రో, ఐసీఐసీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు అరశాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ స్వల్పంగా 0.10శాతం నష్టపోయింది. మరోవైపు ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అరశాతం లాభపడింది. వేదాంత 0.37శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.08శాతం లాభాల్లో ముగిశాయి.  భారీ లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు:-  చైనాతో వాణిజ్య ఒప్పంద ఖరారు అశలు, బలమైన

Most from this category