News


బలమైన ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా ఆర్‌బీఐ నిఘానేత్రం

Friday 30th August 2019
news_main1567157090.png-28114

బ్యాంకింగేతర వ్యవస్థను బలపరిచేందుకు కీలకమైన ఎన్‌బీఎఫ్‌సీలను కూడా ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తన పర్యవేక్షణలోకి తీసుకురానుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు(నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు), వాణిజ్య బ్యాంకులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆర్‌బీఐ ఇకపై నిశితంగా పరిశీలించనుంది. ఇందులో శ్రీరామ్‌ గ్రూప్‌కు చెందిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్సర్వ్‌ వంటి దిగ్గజాలున్నాయి. కాగా ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌లో 85 శాతం ఆస్తులు వీటి కిందనే ఉండగా, బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర రంగాల మొత్తం ఆస్తులలో 12 శాతం ఎన్‌బీఎఫ్‌సీలే కలిగి ఉన్నాయి.
   ఎన్‌బీఎఫ్‌సీలను క్షుణ్ణంగా పర్యవేక్షించేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీలపై ఆన్‌ సైట్‌లో పరీక్షలను, ఆఫ్‌ సైట్‌లో నిఘాను పెంచనుంది. అంతేకాకుండా మార్కెట్‌ నిపుణులు, చట్టబద్దమైన ఆడిటర్ల నుంచి అందుకున్న వార్షిక సర్టిఫికేట్లను పరిశీలించనుంది. ఆర్‌బీఐ అన్ని ఎన్‌బీఎఫ్‌సీలను ఒకే సారి తనిఖీ చేయనుంది. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీలకు, వాటి గ్రూప్‌కు చెందిన ఇతర బ్యాంకులకు లేదా ఎన్‌బీఎఫ్‌సీకి మధ్యగల ఇంట్రా, ఇంటర్‌ గ్రూప్‌ బదిలీలను ఆర్‌బీఐ పర్యవేక్షించనుంది. ‘బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వ్యవస్థగత బంధాన్ని అర్థం చేసుకోడానికి, నిరంతరం వీటిని పర్యవేక్షించే డిపార్ట్‌మెంట్‌ను ప్రతిపాదించాం. ఫలితంగా వీటి మధ్య ఏర్పడే వ్యవస్థాగత ప్రమాదాలు, సంబంధాలు వంటి అంశాలను అర్థం చేసుకోడానికి వీలుంటుంది’ అని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. మొత్తంగా రూ. 500 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్న ​276 ఎన్‌బీఎఫ్‌సీలు ప్రస్తుతం డిపాజిట్లను స్వికరిస్తున్నాయి. వీటిని ఆన్‌ సైట్‌, ఆఫ్‌ సైట్‌ పరంగా ఆర్‌బీఐ పర్యవేక్షించనున్నది. కనీసం రూ. 2 కోట్ల ఫండ్లను కలిగివుండని 1,604 బ్యాంకేతర రిజిస్ట్రేషన్లను ఆర్‌బీఐ రద్దుచేసిన విషయం తెలిసిందే. 



You may be interested

సెప్టెంబర్‌ చివరి నాటికి 74 స్థాయికి రూపాయి ..?

Friday 30th August 2019

అమెరికా చైనా మధ్య నిరంతరం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం, డాలర్‌ మారకంలో యువాన్‌ కరెన్సీ క్షీణత తదితర కారణాలతో ఈ సెప్టెంబర్‌ నాటికి రూపాయి విలువ 74స్థాయికి చేరుకుంటుందని వకార్ జావేద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.  గతేడాది అక్టోబర్‌, డిసెంబర్‌  మధ్య కాలంలో రూపాయి దాదాపు 4శాతం బలపడింది. ఇదే కాలంలో అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు చల్లారడటంతో

పెరిగిన షార్ట్స్‌ రోల్‌ఓవర్‌.. అప్‌మూవ్‌కు ప్రతికూలమే!

Friday 30th August 2019

-సెప్టెంబర్‌ సిరీస్ రోల్‌ఓవర్‌లో పెరిగిన షార్ట్‌పొజిషన్లు దేశియ, అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కారణాన ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ సిరీస్‌లో అధికంగా షార్ట్‌ పొజిషన్‌లను రోల్‌ఓవర్‌ చేసుకున్నారు. కాగా ఈ భయాలు ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక చర్యలు, ద్రవ్యలభ్యత చర్యలను నిరుపయోగం చేశాయని విశ్లేషకులు తెలిపారు. నిఫ్టీ అగష్టు సిరీస్‌లో 2.7 శాతం నష్టపోయింది. దీంతో గత వరుస మూడు సిరీస్‌లలో నిఫ్టీ నష్టల్లోనే ముగియడం గమనార్హం. నిఫ్టీ అగష్టు

Most from this category