చైనాతో వాణిజ్యలోటు తగ్గింపుపై భారత్ దృష్టి
By Sakshi

న్యూఢిల్లీ: చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటును తగ్గించడంపై భారత్ దృష్టి సారిస్తోంది. ఎగుమతులు- దిగుమతుల మధ్య ఉన్న నికర వ్యత్యాసాన్ని వాణిజ్య లోటుగా వ్యవహరిస్తుంటారు. 2017-18లో చైనాతో భారత్ వాణిజ్యలోటు విలువ 53.56 బిలియన్ డాలర్లు. చైనాకు ఎగుమతులు పెంపు, దిగుమతులను తగ్గించుకోవడం ప్రధాన అంశాలుగా వాణిజ్యలోటు సమస్యను అధిగమించవచ్చని వాణిజ్యమంత్రిత్వశాఖ రూపొందించిన ఒక వ్యూహాత్మక నివేదిక పత్రం పేర్కొంది. ఈ పత్రాన్ని ఇప్పటికే వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు సమర్పించడం జరిగిందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. చైనాకు ఎగుమతులు పెరగడానికి మరిన్ని ప్రోత్సాహకాలు అవసరం అని కూడా నివేదిక పత్రం వివరించింది. నిజానికి ఇప్పటికే భారత్ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది. దీనివల్ల 2016-17లో చైనాతో భారత్‌కు ఉన్న 63 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు, 2017-18లో 53.56 బిలియన్ డాలర్లకు తగ్గింది.
You may be interested
కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు
Saturday 25th May 2019జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభం 48 శాతం డౌన్ రూ.15,700 కోట్ల పెట్టుబడులు మొత్తం ఆదాయం రూ.22,421 కోట్లకు న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి క్వార్టర్లో 48 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.2,879 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,495 కోట్లకు తగ్గిందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. వ్యయాలు పెరగడం, రియలైజేషన్లు
ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌పై కసరత్తు
Saturday 25th May 2019ఈవోఐల జారీ బాధ్యత ఈవైకి అప్పగింత న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాల విక్రయ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేస్తోంది. వాటాల విక్రయానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) సత్వరం జారీ చేసే బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్‌కు (ఈవై) అప్పగించింది. ఈ లావాదేవీ పూర్తయ్యే దాకా సలహాదారు సంస్థగా ఈవై కొనసాగుతుందని, డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యాక ఫీజు చెల్లించడం జరుగుతుందని