News


షేర్లపై జీడీపీ ప్రభావం చాలా స్వల్పం!

Thursday 17th October 2019
news_main1571289841.png-28947

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా
జీడీపీ వృద్ధికి, స్టాక్స్‌ ధరలు మధ్య చాలా స్వల్ప సంబంధం ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌నివేదిక వెల్లడించింది. అయితే ఆశ‍్చర్యకరంగా జీడీపీ ట్రెండ్‌ను తెలుసుకోవడానికి మాత్రం స్టాక్‌ ధరలు మంచి సూచికలుగా పనికివస్తాయని తెలిపింది. కానీ జీడీపీ ట్రెండ్‌ ఆధారంగా స్టాక్స్‌ ధరలను అంచనా వేయలేమని పేర్కొంది. స్టాక్స్‌ ధరలు పెరగడమనేది జీడీపీ నిజ వృద్ధికి అనులోమానుపాతంలో ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ తాజా రిసెర్చ్‌ప్రకారం కార్పొరేట్‌ ప్రాఫిట్‌ సైకిల్స్‌ జీడీపీ గణాంకాల కన్నా లెవరేజ్‌ ఎఫెక్ట్‌(ఆర్‌ఓసీ మైనస్‌ ఆర్‌ఓఈ)పైనే ఎక్కువ ఆధారపడతాయని తెలియజేస్తోంది. ప్రస్తుతం వ్యవస్థలో అల్ప సామర్ధ్య​ వినియోగం కారణంగా లెవరేజ్‌ ఎఫెక్ట్‌ సైతం తక్కువగా ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో జీడీపీలో మందగమనం మార్కెట్లు జీర్ణించుకున్నాయని, అందువల్ల మార్కెట్‌పై జీడీపీ డేటా పెద్ద ప్రభావం చూపకపోవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తన నివేదికలో తెలిపింది. 

2013 నుంచి భారత్‌లో కార్పొరేట్‌ టాక్స్‌రేటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో జీడీపీలో కార్పొరేట్‌ టాక్స్‌ వాటా పెరుగుతూ రాగా, జీడీపీలో నికరలాభాల వాటా తగ్గుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో ఈ ట్రెండ్‌ రివర్స్‌ కానుంది. ఈ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే కనిపిస్తుందని, ఈ ఏడాది జీడీపీ పెద్దగా మారకున్నా, కార్పొరేట్‌ ప్రాఫిట్స్‌లో పెరుగుదల ఉండొచ్చని రిసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. జీడీపీ ప్రభావం స్టాక్స్‌పై పెద్దగా ఉండదనేందుకు మరో ఉదాహరణ టాటా మోటర్స్‌, ఎయిర్‌టెల్‌ షేర్లని నివేదిక తెలిపింది. వీటిపై వీటి విదేశీ వ్యాపారాల ప్రభావం ఎక్కువగా ఉందని, జీడీపీలో మార్పులు వీటిపై పెద్దగా ప్రభావం చూపలేదని వివరించింది. స్టాకు ధరలను కీలకంగా ప్రభావితం చేసేవి డిస్కౌంట్‌ కనిష్ఠ రేటు, ఈపీఎస్‌లో జోరు మాత్రమేనని తేల్చిచెప్పింది. 



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 17th October 2019

స్వల్పలాభంతో ట్రేడ్‌ అవుతున్న మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ఉదయం సెషన్‌లో 1.50శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,369.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లలో అమ్మకాలు నెలకొనడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.50శాతం నష్టపోయి 2,352.10 స్థాయికి పతనమైంది. ఉదయం గం.10:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2352.1)తో పోలిస్తే

బజాజ్‌ కన్జ్యుమర్‌ 6% అప్‌

Thursday 17th October 2019

   బజాజ్‌ రీసోర్సెస్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో తన 22 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవి ద్వారా రూ. 628 కోట్లకు మంగళవారం విక్రయించిన విషయం తెలిసిందే. రుణాలను చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించనున్నామని కంపెనీ తెలిపింది. ఫలితంగా గత కొన్ని సెషన్‌ల నుంచి బజాజ్‌ కన్జ్యుమర్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. గత సెషన్‌లో 15 శాతానికి పైగా ర్యాలీ చేసిన ఈ షేరు, గురువారం ఉదయం 10.43

Most from this category