News


ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ

Monday 26th August 2019
news_main1566792051.png-28004

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చగలవని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. బహుళ రంగ, బహుముఖ విధానపరమైన చర్యలతో వృద్ధికి ఊతం లభించగలదని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్‌ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, వాణిజ్యపరమైన మందగమనం కారణంగా ప్రపంచ ఎకానమీకి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటన పరిశ్రమలకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. "ద్రవ్య లోటుపై ఒత్తిడి పడకుండా బహుళ రంగాలకు ఊతమిచ్చే ప్రతిపాదనలు రూపొందించిన తీరు ప్రశంసనీయం. ఈ ప్రకటనలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సిక్సర్‌ కొట్టారు" అని కిర్లోస్కర్ తెలిపారు. రాబోయే నెలల్లో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని సీఐఐ ఆశాభావం వ్యక్తం చేసింది. "విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, దేశీ ఇన్వెస్టర్ల ఆదాయాలపై పెంచిన సర్‌చార్జీలను ఎత్తివేయడం, రెపో రేట్ల తగ్గుదల ప్రయోజనాలను బదలాయించేటువంటి నిర్ణయాలు, సంస్థలకు రీఫండ్స్‌ను వేగవంతం చేయడం వంటి సమగ్రమైన చర్యలతో పెట్టుబడులకు తోడ్పాటు లభించగలదు" అని సీఐఐ ప్రెసిడెంట్-డెసిగ్నేట్‌ ఉదయ్‌ కొటక్‌ పేర్కొన్నారు. 



You may be interested

రిటైర్మెంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 26th August 2019

ధీరేంద్ర కుమార్‌ సీఈవో వాల్యూ రీసెర్చ్‌ సీఈవో ప్ర: నా వయస్సు 25 సంవత్సరాలు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా  ఇటీవలనే ఉద్యోగంలో చేరాను. 10 నుంచి 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? లేక మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ?  -శివాజీ, హైదరాబాద్‌ జ: మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ రెండింటిలో దేనినీ ఎంచుకోవద్దు. మీరు 10–15 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మల్టీ–క్యాప్‌

సెన్సెక్స్‌ 37,050 స్థాయిని అధిగమిస్తే..

Monday 26th August 2019

శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత దేశీయంగా ఇన్వెస్టర్లు ఆశిస్తున్న సానుకూల ప్రకటన ఆర్థిక మంత్రి నుంచి వెలువడగా, అంతర్జాతీయంగా అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ మహోధృతరూపం దాల్చింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ ఉపసంహరణ, వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, రుణాల్ని చౌకగా లభింపచేయడం, ఆటోమొబైల్‌ రంగానికి రాయితీలు వంటి చర్యలన్నీ ఇన్వెస్టర్లకు రుచించేవే. అయితే అమెరికా ఉత్పత్తులపై చైనా టారీఫ్‌లు వేయడం, వెనువెంటనే చైనా నుంచి అమెరికా కంపెనీల్ని

Most from this category