News


పెరిగిన స్టీల్‌ ధరలు..ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా?

Tuesday 12th November 2019
news_main1573552683.png-29532

దేశీయ అతి పెద్ద స్టీల్‌ కంపెనీలయిన టాటా స్టీల్‌, జేఎస్‌డబ్యూ స్టీల్‌, గత ఆరు నెలల్లో మొదటి సారిగా ప్రాధమిక స్టీల్‌ అయిన హెచ్‌ఆర్‌సీ(హాట్‌ రోల్డ్‌ కాయిల్‌) ధరలను పెంచాయి. కాగా వ్యవస్థలో ధరలు, డిమాండ్‌ పరంగా ఉన్న మందగమనం బాటమ్ ఔట్‌ అవుతోందనే సంకేతాలను ఇది ఇస్తోందని విశ్లేషకులు తెలిపారు. ఈ రెండు కంపెనీలు టన్ను హెచ్‌ఆర్‌సీపై రూ. 500 నుం‍చి రూ. 750 వరకు ధరలను పెంచాయి. గత నెలలో టన్ను హెచ్‌ఆర్‌సీ ధర రూ. 34,250 గా ఉండగా, ప్రస్తుతం దీని ధర రూ. 35,000 చేరుకుంది. కాగా హెచ్‌ఆర్‌సీ ధరలు అక్టోబర్‌ నెలలో మూడేళ్ల కనిష్ఠానికి పడిపోవడం గమనార్హం. ‘కంపెనీ డీ స్టాకింగ్‌ విధానం పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రజలు తమకేం కావాలో అదే కొంటారు’ అని టాటా స్టీల్‌ గ్లోబల్‌ సీఈఓ, ఎండీ, టీవీ నరేంద్రన్‌ అన్నారు. ‘పెరిగిన ధరలను మార్కెట్లు గుర్తించాయి. ఈ నెల చివరి వరకు ఎదురు చూడాలని అనుకుంటున్నాం’ అని అన్నారు. వచ్చే కొన్ని వారాల్లో ఇలాంటి మరికొన్ని చర్యలను కంపెనీ తీసుకొనుందనే సంకేతాలను ఆయన ఇవ్వడం గమనార్హం. ‘ఈ ఏడాది మే నెలలో స్వల్పంగా ధరలు పెరిగనప్పటికి, పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడే స్టీల్‌ ధరలు పెరిగాయి’ అని జేఎస్‌డబ్యూ స్టీల్‌, డైరక్టర్‌, కమర్షియల్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ జయంత్‌ ఆచార్య అన్నారు. 
    స్టీల్‌ పరిశ్రమకు కీలకమైన ఆటో, మౌలిక రంగాలు మందగమనంలో చిక్కుకోవడంతో స్టీల్‌ పరిశ్రమ దీర్ఘకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ధరలు పెరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. దీర్ఘకాలంగా కొనసాగిన ఆర్థిక మందగమనం వలన పెద్ద పెద్ద మౌలిక ప్రాజెక్టులు ఆగిపోయాయి. కార్లు, ద్వి చక్ర వాహన తయారిదారులు ఉత్పత్తిని నిలిపివేసి, ఉద్యోగులను తొలగించడం చూశాం. ఫలితంగా అనేక స్టీల్‌ కంపెనీలు తమ ప్లాంట్‌లను మూసివేశాయి. ఈ ఏడాది ప్రథమార్దంలో  టాటా స్టీల్‌, జేఎస్‌డబ్యూ స్టీల్‌ అమ్మకాలు భారీగా  పడిపోయాయి. ఈ కంపెనీల ఆదాయం, లాభం జూన్‌ త్రైమాసికంలో భారీగా ప్రభావితమయ్యాయి.  ప్రభుత్వం ట్యాక్స్‌ రేట్లను తగ్గించకుండా ఉండివుంటే, ఈ సెప్టెంబర్‌ త్రైమాసికంలో కూడా కంపెనీల నికర లాభాం భారీగా పతనమయ్యేది. ఈ కంపెనీల నిల్వలు తగ్గుతున్న సమయంలో ధరల  స్టీల్‌ ధరలు పెరగడం గమనార్హం. ‘మిల్లులు, మార్కెట్‌ స్థాయిలో కంపెనీ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ముంబైలో సాధారణంగా ఉండాల్సిన నిల్వల కంటే మూడోవంతు ఉన్నాయి. ఆటో కంపెనీల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి’ అని ఆచార్య అన్నారు. స్టీల్‌కు సంబంధించి ముడి పదార్థాలైన ఇనుప ఖనిజం, బొగ్గు వంటి పదర్దాల ధరలు పెరగడంతో అంతర్జాతీయంగా కూడా స్టీల్‌ ధరలు పుంజుకున్నాయి. 
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందా?
ప్రస్తుతం పెరిగిన స్టీల్‌ ధరల వలన, సెప్టెంబర్‌ నెలలో  4.3 శాతం(నెల వారిగా) మేర పడిపోయిన దేశీయ పారిశ్రామిక ఉత్పాదకత తిరిగి పుంజుకుంటుందనే అంచనాలు పెరిగాయి.  ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ ప్రొడక్సన్‌(ఐఐపీ) డేటా ప్రకారం దేశీయ తయారీరంగ ఉత్పాదకత సెప్టెంబర్‌ నెలలో 3.9 శాతం పడిపోయింది. అదే విధంగా మైనింగ్‌ 8.5 శాతం పతనమయ్యింది. అయినప్పటికి పండుగ సీజన్‌ తోడవ్వడంతో అక్టోబర్‌ నెలలో మందగమనం బాటమ్‌ ఔట్‌ అవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. దేశీయ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు అక్టోబర్‌ నెలలో స్వల్పంగా(0.28శాతం) పెరిగి 2,85,027గా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఈ అమ్మకాలు 2,84,223 గా ఉన్నాయి. ఇది స్టీల్‌ కంపెనీలకు సానుకూలంగా మారింది. చాలా వరకు స్టీల్‌ కంపెనీలు, ఆటో కంపెనీలతో తమ కాంట్రాక్టులను వచ్చే ఆరునెలల కోసం పునరుద్ధరించుకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ కాంట్రాక్టుల ధరలు గత ఆరు నెలలోని ధరల ధోరణిని అనుసరించి ఉంటాయి.  ‘మేము మా వినియోగదారులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఆరు నెలల కోసం కుదుర్చుకునే కాంట్రాక్టులపై, తాజాగా తగ్గిన స్టీల్‌ ధరల ప్రభావం ఉంటుంది. కానీ భవిష్యత్తులో  వీటి ధరలు బాగుంటాయి’ అని ఆచార్య అన్నారు. ‘గతంలో కంటే తక్కువగా ఉన్న రేట్లను , ఆటో కాంట్రాక్టులను టాటా స్టీల్‌ ఖరారు చేసింది. ప్రస్తుతం పెరిగిన స్టీల్‌ ధరలు వచ్చే కాంట్రాక్టులో ప్రతిబింబిస్తాయి’ అని నరేంద్రన్‌ అన్నారు. 



You may be interested

పది కంపెనీల్లో రాకేశ్‌ వాటా మార్పులు!

Tuesday 12th November 2019

సెప్టెంబర్‌లో ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా  పోర్టుఫోలియోలోని పది స్టాకుల్లో వాటాలు మార్పులు పొందాయి, మరో 15 కంపెనీల్లో వాటాలు స్థిరంగా ఉన్నాయి. సెప్టెంబర్‌లో రాకేశ్‌ ఐదు కంపెనీల్లో వాటాలను పెంచుకున్నాడు మరో ఐదింటిలో వాటాలు తగ్గించుకున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, ఆగ్రోటెక్‌ ఫుడ్స్‌, ఎన్‌సీసీ, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ షేర్లను సెప్టెంబర్లో రాకేశ్‌ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇంతవరకు ఈ షేర్లు దాదాపు 9-

మరోసారి ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు?

Tuesday 12th November 2019

తయారీ, మైనింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఉత్పత్తి క్షీణించడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక రంగం నేలచూపులు చూసింది. ఫలితంగా పారిశ్రామికోత్పత్తి సూచి(ఐఐపీ) గత ఏనిమిదేళ్లలో అత్యల్ప స్థాయికి చేరుకుంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో ఐఐటీ సూచీ -4.3శాతంగా నమోదైంది. ఏడాది క్రితం సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 4.6శాతంగా నమోదైంది. 2011-12 సిరీస్‌లో సెప్టెంబర్‌ వృద్ధి అత్యల్పం కావడం గమనార్హం. గణాంకాలు నిరుత్సాహపరిచిన నేపథ్యంలో డిసెంబర్‌లో జరిగే ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమావేశంలో మానిటరీ

Most from this category