News


రాష్ట్రాలకు పెట్రో ధరలు తగ్గించే వెసులుబాటు!

Wednesday 12th September 2018
news_main1536730964.png-20194

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలూ తీవ్రంగా ఉన్నాయి. దీనితో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆయా అంశాలు రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ మొత్తంలో రూ.22,700 కోట్ల ‘వ్యాట్‌’ (వీఏటీ) ఆదాయాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ధర సగటున 75 డాలర్లు, డాలర్‌ మారకంలో రూపాయి 72గా ఉంటుందని భావిస్తూ తాజా అంచనాలు లెక్కగట్టడం జరిగింది. ఈ అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌కు ఒక డాలర్‌ ధర పెరిగితే, రూపాయిల్లో ఇది 19 రాష్ట్రాలకు సగటును రూ.1,513 కోట్ల పన్ను ఆదాయాన్ని తెచ్చిపెట్టే వీలుంది. వేర్వేరుగా చూస్తే, ఈ ఆదాయాల విషయంలో రూ.3,389 కోట్లతో మహారాష్ట్ర ముందు నిలవగా, రూ.2,842 కోట్లతో గుజరాత్‌ రెండవ స్థానంలో నిలవనుంది. 
- మహారాష్ట్రలో ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.89 దాటింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌పై వ్యాట్‌ అత్యధికంగా 39.12 శాతం ఉంది. ఈ విషయంలో గోవాలో కేవలం 16.66 శాతం వ్యాట్‌ అమలవుతోంది. 
- ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని భావిస్తే, పెట్రో ధరల పెంపుతో వస్తున్న ఆదాయాల వల్ల రాష్ట్రాలు తమ ద్రవ్యలోటును సగటున 15 నుంచి 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించుకోవచ్చు. 
- 2018-19 బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికి మించిన ఆదాయం వస్తున్న నేపథ్యంలో తమ ఆదాయాలకు ఢోకా లేకుండా రాష్ట్రాలు.. డీజిల్‌పై లీటరుకు సగటున రూ. 2.30 పైసలు, పెట్రోల్‌పై రూ.3.20 పైసలు ధర తగ్గించుకునే వీలుంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్తాన్‌, కర్ణాటకలకు ఆర్థికంగా పెట్రోల్‌ లీటర్‌కు రూ.3, డీజిల్‌పై రూ.2.50 తగ్గించే వెసులుబాటు ఉంది. 
- రాష్ట్రాలు బేస్‌ ప్రైస్‌ (క్రూడ్‌, రవాణా వ్యయాలు, కమిషన్‌)పై వ్యాట్‌ విధిస్తే,  లీటర్‌కు డీజిల్‌ ధర రూ.3.75, పెట్రోల్‌ ధర రూ. 5.75 తగ్గించే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇంతమొత్తం తగ్గిస్తే మాత్రం మొత్తంగా రాష్ట్రాలకు దాదాపు రూ.12,000 కోట్ల నికర ఆదాయ నష్టం వస్తుంది. (ఆయిల్‌ వల్ల పొందే లాభం రూ.22,700 కోట్లయితే పైన పేర్కొన్న ధర తగ్గింపు వల్ల నికర నష్టం రూ.34,627 కోట్లు).You may be interested

నేను ఏ తప్పూ చేయలేదు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అక్రమంగా తన ఆస్తులను అటాచ్‌ చేసిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) భారీ రుణ కుంభకోణ నిందితుడు మేహుల్‌ చోక్సీ ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన వెల్లడించారు. ఆంటిగ్వా నుంచి పంపిన తొలి వీడియో మేసేజ్‌లో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన రూ.13,500 కోట్ల రుణ కుంభకోణంలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరిగా అనుమానిస్తున్న మేహుల్‌ చోక్సీకి వ్యతిరేకంగా

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం క్రాష్‌

Wednesday 12th September 2018

ముంబై:- ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఉదయం సెషన్స్‌లో ఒడిదుడుకుల నడుమ ట్రేడ్‌ అవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 11300ల స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, అటో, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌ రంగ షేర్లు నష్టపోతున్న తరుణంలో నిఫ్టీ బ్యాంకు సూచి దాదాపు 1శాతం వరకు నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్‌ సూచి:- నిన్నటి ట్రేడింగ్‌లో దాదాపు

Most from this category