రూపాయికి ఆసియా కరెన్సీల లాభాల మద్దతు
By Sakshi

21 లాభపడి 69.70కి రూపాయి
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో నష్టపోతూ వచ్చిన రూపాయి మంగళవారం కొంత కోలుకుంది. డాలర్ మారకంలో 21 పైసలు లాభపడి 69.70 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల స్పీడ్ తగ్గడం, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ సమావేశం నేపథ్యంలో డాలర్ బలహీనత వంటి అంశాలు తాజాగా రూపాయిపై ప్రభావం చూపాయి. దీనితో దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల పరిస్థితి తీవ్ర ఒడిదుడుకులతో ఉన్నా, రూపాయిపై ఎటువంటి ప్రతికూలతా కనబడలేదు. ఇక పలు ఆసియా కరెన్సీల లాభాలూ రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతిదారులు కూడా డాలర్ల అమ్మకానికి దిగారు. మంగళవారం 69.82 కనిష్ట-69.70 గరిష్ట స్థాయిలను చూసింది. ఈ వార్తరాసే 9.30 గంటల సమయంలో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 97.15 వద్ద ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే 69.50 వద్ద ట్రేడవుతోంది. అంటే భారత్‌లో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ముగింపుకన్నా మరింతగా 20 పైసలు బలపడిందన్నమాట. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. కాగా అటు తర్వాత అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పటిష్టస్థాయి, అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితులు దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా.
You may be interested
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ అనూహ్య నిర్ణయం
Wednesday 19th June 2019హెచ్డీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. గడువు తీరిన ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ల(ఎఫ్ఎంపీ) నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకుగాను రూ.500 కోట్ల కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సెల్ గ్రూపు కంపెనీల ఎన్‌సీడీల్లో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ పలు పథకాల ద్వారా పెట్టుబడులు పెట్టింది. ఎస్సెల్ గ్రూపు కంపెనీలు తీవ్ర నిధుల సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఎన్‌సీడీలకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోయాయి. వచ్చే సెప్టెంబర్ వరకు
మేలో ఎంఎఫ్‌లు కొన్న టాప్10 స్టాకులివే!
Tuesday 18th June 2019మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల పర్యవేక్షణలోని ఏయూఎంల విలువ మేలో రూ. 25.94 లక్షల కోట్లకు ఎగబాకింది. ఏయూఎంల్లో డొమెస్టిక్ సైక్లిక్స్ వెయిటేజ్ పదేళ్ల గరిష్ఠం 62.9 శాతానికి చేరింది. టెలికం, రియల్టీ, పీఎస్యూబ్యాంకుల వాల్యూ ఏప్రిల్‌తో పోలిస్తే మెరుగైంది. మరోవైపు మీడియా, హెల్త్‌కేర్, మెటల్స్, ఆటో, టెక్నాలజీ, కన్జూమర్రంగాలలోకి పెట్టుబడులు సన్నగిల్లాయి. నిఫ్టీలోని 58 శాతం స్టాకుల్లో ఎంఎఫ్‌లు నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. మేనెల్లో ఎంఎఫ్‌లు కొనుగోలు చేసిన టాప్‌టెన్