News


మహిళా సంక్షేమానికి పెద్దపీట

Saturday 6th July 2019
news_main1562398541.png-26861

న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళ, శిశు అభివృద్ధితోపాటు సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20 సంవత్సరానికిగాను మొత్తం 29, 000 కోట్ల రూపాయలు మహిళా, శిశు సంక్షేమానికి, అభివృద్ధికి వెచ్చించనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో రూ.19,834.37 కోట్లు అంగన్‌వాడీ సేవలకు వెచ్చిస్తారు. పౌష్టికాహారం, సామాజిక భద్రత, సంక్షేమ రంగాలకు రూ.4,178 కోట్లు దక్కగా.. గత ఏడాది ఈ రంగాలకు రూ.2,551 కోట్లు మాత్రమే అందాయి. మాతా శిశు సంరక్షణ సేవలకు ఉద్దేశించిన ప్రధానమంత్రి మాతృ వందన యోజనకు రూ.2,500 కోట్లు లభించగా..ఈ మొత్తం గత ఏడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. ఈ పథకంలో భాగంగా ప్రసూతి, పాలిచ్చే మహిళలకు రూ.6 వేలు అందిస్తారు. సమీకృత శిశు సంక్షేమ సేవలకు కూడా గత ఏడాది రూ.925 కోట్ల నుంచి ఈసారి రూ.1,500 కోట్లకు పెంచారు.
మహిళ, శిశు సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులపై ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మహిళా ఆధారిత అభివృద్ధికి ఈ కేటాయింపులు ఊతమిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మానసపుత్రిక ‘బేటీ బచావో.. బేటీ పఢావో’కు రూ.280 కోట్లు దక్కగా జాతీయ పోషకాహార పథకానికి ఏకంగా రూ.3,400 కోట్లు, మహిళా శక్తి కేంద్రాలకు రూ.150 కోట్లు లభించాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత ఏడాది రూ.4, 400 కోట్లు ఎక్కువగా అంటే రూ.28, 914 కోట్లు దక్కగా.. జాతీయ శిశు సంరక్షణ కేంద్రాల నిధులు కూడా రూ.20 కోట్లు పెరిగి రూ.50 కోట్లు అయ్యాయి. ఉద్యోగం చేస్తున్న మహిళలకు సురక్షితమైన హాస్టల్‌ వసతి అందించేందుక గత ఏడాది రూ.52 కోట్లు మాత్రమే కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తం మూడు రెట్లు పెరిగి రూ.165 కోట్లు అయ్యింది. అక్రమ రవాణాను నివారించడంతోపాటు ఇతర మహిళ రక్షణ అవసరాల కోసం ఈ ఏడాది రూ.30 కోట్లు కోటాయించగా.. వితంతువుల ఇళ్ల కోసం రూ.15 కోట్లు దక్కాయి. మొత్తమ్మీద మహిళ రక్షణ, సాధికారతలకు రూ.1,315 కోట్లు లభించాయి. 



You may be interested

ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ కేసులకు క్షమాపణ పథకం

Saturday 6th July 2019

రూ.3.75 లక్షల కోట్ల పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చర్యలు న్యూఢిల్లీ: సేవల పన్ను, ఎక్సైజ్‌ సుంకాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న రూ.3.75 లక్షల కోట్ల విలువకు సంబంధించి కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ‘సబ్‌కా విశ్వాస్‌ లెగసీ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ స్కీమ్‌ 2019’ అనే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిల్లో 40 నుంచి 70 శాతం వరకు ఉపశమనం లభించనుంది. స్వచ్చందంగా వెల్లడించిన కేసులు కాకుండా ఇతర కేసులకు

బడ్జెట్‌ షేర్లు

Saturday 6th July 2019

ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్‌లోని వివిధ ప్రతిపాదనలకు ప్రభావితమయ్యే షేర్ల వివరాలు.... సానుకూలం  ప్రతిపాదన: సిగరెట్లపై సుంకం పెంపు         ప్రభావిత షేరు: ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, గోల్డెన్‌ టుబాకో (అంచనాల కంటే తక్కువగానే సుంకం పెరిగిన కారణంతో ఈ షేర్లు లాభపడ్డాయి) ప్రతిపాదన: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మేర మూలధన నిధులు ప్రభావిత షేర్లు: ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌

Most from this category