News


సీతారామన్‌... సుదీర్ఘ స్పీచ్‌!

Saturday 1st February 2020
news_main1580552419.png-31404

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త రికార్డు సృష్టించారు. సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ రోజు నిర్మల దాదాపు 2 గంటల 42 నిమిషాల మేర బడ్జెట్‌ ప్రసంగం చేశారు. దీంతో గతంలో ఆమె పేరునే ఉన్న సుదీర్ఘ ప్రసంగం రికార్డును బద్దలు కొట్టారు. గతేడాది జూలైలో నిర్మల తన తొలి బడ్జెట్‌ ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. తిరిగి ఈ రోజు ఆమే తన రికార్డు బ్రేక్‌ చేశారు.

గతంలో 2003లో అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌ దాదాపు 2గంటల 13 నిమిషాల ప్రసంగం చేశారు. అంతకుముందు 1991లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ చేసిన ప్రసంగం కూడా సుదీర్ఘమైనదే!



You may be interested

బడ్జెట్‌ ఎఫెక్ట్‌...సెన్సెక్స్‌ 1000 పాయింట్లు క్రాష్‌

Saturday 1st February 2020

40వేల దిగువన ముగిసిన సెన్సెక్స్‌ 318 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ బడ్జె్ట్‌ మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ శనివారం భారీ నష్టంతో ముగిసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు 2శాతం పతనాన్ని చవిచూశాయి. అన్ని రంగాలపై కస్టమ్‌ డ్యూటీ పెంచడంతో పాటు ఇన్ఫ్రారంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపకపోవడంతో మార్కెట్లో అమ్మకాల సునామీ సాగాయి. లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ)ని రద్దు అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం మార్కెట్‌ వర్గాలను

7 శాతం పెరిగిన ఎంఅండ్‌ఎం వాహన విక్రయాలు

Saturday 1st February 2020

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్ర(ఎంఅండ్‌ఎం) కంపెనీ వాహన విక్రయాలు 4 శాతం పెరిగాయని ప్రకటించింది. గతేడాది జనవరిలో 22,212 ట్రాక్టర్లను విక్రయించగా ఈ ఏడాది జనవరిలో 23,116 ట్రాక్టర్లను విక్రయించినట్లు అధికారికంగా వెల్లడించింది. దేశీయ వాహనాల విక్రయం 7 శాతం పెరగిందని, 22,329 యూనిట్లను విక్రయించనట్లు తెలిపింది. దిగుమతులు 38 శాతం తగ్గడంతో కేవలం 787 మాత్రమే విక్రయించామని పేర్కొంది. గతేడాది 1,264 ట్రాక్టర్లు అమ్మింది.   

Most from this category