News


అందరివాడు .. దాస్‌

Thursday 12th December 2019
news_main1576120288.png-30179

  • ఆర్‌బీఐ గవర్నర్‌గా ఏడాది

    దేశీ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్‌ 12న ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అర్ధాంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్‌ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్‌ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన.  1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దాస్‌.. గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సహా పలు హోదాల్లో సేవలు అందించారు. అందరినీ కలుపుకుపోవడం, అందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశమివ్వడం .. దాస్‌ స్టయిల్‌ అంటారు ఆయన్ను గురించి తెలిసినవారు. ప్రభుత్వానికి నిధుల బదిలీ, మొండిబాకీల పరిష్కారానికి కొత్త విధానం ప్రవేశపెట్టడం మొదలుకుని వరుసగా పలు దఫాలు కీలక రేట్లను తగ్గించడం దాకా ఈ ఏడాది కాలంలో ఆర్‌బీఐ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాలు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి తదితర సవాళ్ల మధ్య దాస్ సారథ్యంలో ఆర్‌బీఐ పనితీరును ఒకసారి సింహావలోకనం చేస్తే ..

- వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో ఆర్‌బీఐ 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అయిదు విడతల్లో 135 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేట్లు తగ్గించింది. ఆగస్టులో అసాధారణంగా 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అయితే, కచ్చితంగా మరో విడత రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ నవంబర్‌లో నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయపర్చింది.
- వృద్ధి అంచనాలను కూడా మొత్తం మీద 240 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. 
- ఆర్‌బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్న వివాదాస్పద చర్చకు ముగింపునిచ్చి, కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల మేర మిగులు నిధులను రిజర్వ్‌ బ్యాంక్‌ బదలాయించింది. 
- చిన్న, మధ్యతరహా సంస్థలకు ఊరటనిస్తూ వన్‌ టైమ్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణ వెసులుబాటు కల్పించింది.
- సత్వర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో నుంచి మూడు బ్యాంకులను (బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌) బైటికి తెచ్చింది. 
- సంస్కరణలపరంగా చూస్తే.. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలు సత్వరం బదిలీ అయ్యేలా బ్యాంకులు .. రుణాలకు సంబంధించి రెపో ఆధారిత ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ విధానానికి మళ్లేలా దాస్‌ కృషి చేశారు. 
- రోజంతా చెల్లింపుల వ్యవస్థలు పనిచేసేలా చూసేందుకు నెఫ్ట్‌ సదుపాయం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తోంది.

 

అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చారు..
నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ గల వ్యక్తి శక్తికాంత దాస్‌. ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఒకే తాటిపైకి తేవడంలోనూ, బోర్డును సమగ్రంగా తీర్చిదిద్దడంలోను అన్ని విధాలా సఫలీకృతమయ్యారు. 
- సచిన్‌ చతుర్వేది, ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సభ్యుడు


ఆర్‌బీఐదే తుది నిర్ణయం..
ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య చాలా విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునేది రిజర్వ్‌ బ్యాంకే. నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్‌బీఐకి 100 శాతం పైగా స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు. 
- శక్తికాంత దాస్, గవర్నర్, ఆర్‌బీఐ 

 You may be interested

దివాలా కోడ్‌కు మరిన్ని సవరణలు

Thursday 12th December 2019

ఎన్‌హెచ్‌ఏఐ ఇన్‌విట్‌కు ఆమోదం బ్యాంకులకు పాక్షిక రుణ హామీ పథకానికి ఓకే కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్‌ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి.

యస్‌ బ్యాంకుకు ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..?

Wednesday 11th December 2019

దేశంలో ఐదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యస్‌ బ్యాంకు నిధుల కోసం దాహం దాహం అంటూ అలమటిస్తుంటే... పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ, పేరున్న ఇన్వెస్టర్లు ముఖం చాటేసిన పరిస్థితి. కెనడాకు చెందిన ఎర్విన్‌సింగ్‌ బ్రెయిచ్ (1.2 బిలియన్‌ డాలర్లు), సిటాక్స్‌ హోల్డింగ్స్‌ (500 మిలియన్‌ డాలర్లు) మాత్రం పెద్ద మొత్తంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. అదే సమయంలో దేశీయంగా పేరున్న ఆదిత్య బిర్లా ఫ్యామిలీ హౌస్‌ కేవలం 25

Most from this category