News


అక్టోబర్‌లోనూ ‘సేవలు’ బాగోలేదు!

Wednesday 6th November 2019
news_main1573011279.png-29375

న్యూఢిల్లీ: దేశంలో మందగమన పరిస్థితులకు సేవల రంగం అద్దం పడుతోంది. అక్టోబర్‌లో వరుసగా రెండవనెలా ఈ విభాగం క్షీణతను నమోదుచేసుకుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. 49.2గా సూచీ నమోదయ్యిందని సంబంధిత నివేదిక తెలిపింది. సెప్టెంబర్‌లోనూ సేవల రంగం క్షీణతనే (48.7) నమోదుచేసుకుంది. అయితే సెప్టెంబర్‌కన్నా అక్టోబర్‌లో పరిస్థితి కొంత మెరుగుపడ్డం కొంత సానుకూల అంశం. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ 50 దిగువన ఉంటే దానిని క్షీణతగా, ఆపైన కొనసాగితే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది. 



You may be interested

ఈ ఏడాది 1,100 స్టార్టప్‌లు

Wednesday 6th November 2019

అయిదేళ్లలో మొత్తం 9,300 అంకుర సంస్థలు మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా కొనసాగుతున్న భారత్‌ నాస్కామ్ వెల్లడి బెంగళూరు: స్టార్టప్ వ్యవస్థకు సంబంధించి భారత్ మూడో అతి పెద్ద దేశంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్‌ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900-9,300 స్థాయికి చేరినట్లయిందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ మంగళవారం వెల్లడించింది. గతేడాది టెక్‌ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 7,800-8,200

ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వోలో త్వరలో వీటికి చోటు?

Wednesday 6th November 2019

ఎన్‌ఎస్‌ఈ వచ్చే ఫిబ్రవరిలో చేపట్టే సవరణలో కొత్త వాటికి చోటు కల్పించే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది. ఎందుకంటే ఎన్‌ఎస్‌ఈపై సెబీ విధించిన ఆరు నెలల నిషేధం అక్టోబర్‌తో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే సవరణలో సుమారు 10 నుంచి 14 సెక్యూరిటీలను ఎఫ్‌అండ్‌వోలో చేర్చొచ్చని ఎడెల్‌వీజ్‌ రీసెర్చ్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తున్నాయి.    వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్‌అండ్‌వోలో ఎన్‌ఎస్‌ఈ కొత్తగా ఏ

Most from this category