News


డిసెంబర్‌లో ‘సేవలు’ బాగున్నాయ్‌: పీఎంఐ

Tuesday 7th January 2020
news_main1578367100.png-30711

న్యూఢిల్లీ: సేవల రంగం డిసెంబర్‌లో చక్కటి పనితీరు కనబరిచినట్లు ఐహెచ్‌ఎస్‌ పర్చేజింగ్‌ మార్కిట్‌  ఇండియా (పీఎంఐ) సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. సూచీ 53.3గా నమోదయినట్లు వివరించింది. నవంబర్‌లో ఈ సూచీ 52.7గా ఉంది. గడచిన ఐదు నెలల్లో సూచీ ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. నవంబర్‌లో సూచీ 52.7గా ఉంది. అయితే పీఎంఐ సూచీ 50 ఎగువన ఉంటే, దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఈ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. కొత్త ఆర్డర్లు పుంజుకోవడం సూచీ డిసెంబర్‌ అప్‌ట్రెండ్‌కు కారణమని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌ పొలైనా డీ లిమా తెలిపారు. 

తయారీ, సేవలు కలిపినా... సానుకూలతే
కాగా తయారీ, సేవల రంగం రెండూ కలిపిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ డిసెంబర్‌లో సానుకూలతలో 53.7గా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ సూచీ 52.7గా ఉంది. 



You may be interested

టాటా-మిస్త్రీ కేసులో ఆర్‌వోసీకి చుక్కెదురు

Tuesday 7th January 2020

గత తీర్పును సవరించేందుకు నిరాకరించిన ఎన్‌సీఎల్‌ఏటీ న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కేసులో తీర్పును సవరించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటీషన్ వేసిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ)కి చుక్కెదురైంది. ఆర్‌వోసీ పిటీషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును సవరించేందుకు తగిన కారణాలేమీ లేవని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ డిసెంబర్ 18న ఇచ్చిన తీర్పులో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. టాటా

11,500 వరకు దిద్దుబాటు!

Tuesday 7th January 2020

సెన్సెక్స్‌ 800 పాయింట్ల వరకు క్షీణించి ఈ ఏడాదిలో అత్యధిక ఒక్కరోజు నష్టాన్ని సోమవారం నమోదు చేసింది. 2019 జూలై 8 తర్వాత సెన్సెక్స్‌కు ఇది అత్యధిక ఒక్క రోజు నష్టం కూడా. నిఫ్టీ కీలకమైన 12,000 పాయింట్లకు దిగువన, సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల దిగువకు వచ్చేశాయి. ఈ దశలో కీలక మద్దతు స్థాయిలను అవి కోల్పోయాయి. గత ఐదేళ్ల కాలంలో చూస్తే 2015 ఆగస్ట్‌ 24న సెన్సెక్స్‌ ఒకేరోజు

Most from this category