News


సెబీ స్మార్ట్‌ నిర్ణయాలు

Thursday 22nd August 2019
news_main1566446281.png-27932

  • ఆమోదం తెలిపిన సెబీ 
  • సూచీల్లోకి స్టార్టప్‌లు
  • మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ సూచనలు 
  • మరికొన్ని ప్రతిపాదనలకు సెబీ పచ్చజెండా 

 
స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్‌ సిటీస్‌కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ విభాగాలు కలిగిన కంపెనీలకు షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది.  రుణ చెల్లింపుల విఫలానికి సంబంధించిన వివరాలను రేటింగ్‌ ఏజెన్సీలకు లిస్టెడ్‌ కంపెనీలు వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా కఠిన నిబంధనలను జారీ చేసింది. బుధవారం సమావేశమైన సెబీ డైరెక్టర్ల బోర్డ్‌ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలు....

ఎఫ్‌పీఐల నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ)నిబంధనలు  మరింత సరళతరమయ్యాయి. 
స్మార్ట్‌ సిటీలు, సిటీ ప్లానింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో  నమైదైన సంస్థలు మునిసిపల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకోవచ్చు. 
ప్రస్తుతం స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల ఇన్నోవేటర్స్‌ గ్రోత్‌ ప్లాట్‌ఫార్మ్‌పై నమోదైన స్టార్టప్‌లు ఇక నుంచి స్టాక్‌ సూచీలకు మారవచ్చు. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. 
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి సమాచారమందించే వ్యక్తులు, సంస్థలకు రూ. కోటి వరకూ నజరానా ఇవ్వనున్నారు. కంపెనీ ఆడిటర్లు దీనికి అనర్హులు. 
కంపెనీ చెల్లించిన మూలధనం, రిజర్వ్‌ల్లో లో 25 శాతానికి మించకుండా బైబ్యాక్‌ ఆఫర్‌ ఉండాలి. ఈ ఆఫర్‌ 10 శాతానికి మించినట్లయితే, ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం పొందాల్సి  ఉంటుంది.



You may be interested

ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు

Thursday 22nd August 2019

ఉదయం 7 గం.ల నుంచే ప్రారంభం భారీ పరిమాణంలో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్‌టీజీఎస్‌ సిస్టమ్ వేళలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. రియల్‌ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్‌) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ

71.56 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 22nd August 2019

రూపీ డాలర్‌మారకంలో గురువారం 71.56 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు డాలర్‌మారకంలో బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 16 పైసలు బలపడి 71.55 వద్ద ముగిసింది. కాగా గత సెషన్‌లో బుల్లిష్‌గా ప్రారంభమైన రూపీ 71.36 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన విషయం గమనార్హం. రూపీ డాలర్‌ మారకంలో అగష్టు కాంట్రాక్ట్‌ బుధవారం 71.59గా ఉండగా, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 8.09 శాతం

Most from this category