News


ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

Tuesday 30th July 2019
news_main1564465071.png-27403

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ కాలపరిమితులపై డిపాజిట్‌ రేట్లను తగ్గించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (ప్రస్తుతం 5.75 శాతం) తగ్గింపు వంటి అంశాలు దీనికి నేపథ్యం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ వరుసగా మూడుసార్లు మొత్తం 75 బేసిస్‌ పాయింట్లు (ముప్పావుశాతం) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో తామిచ్చే రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తాయికనుక, తీసుకునే డిపాజిట్‌ రేట్లను కూడా తగ్గించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 170 రోజుల వరకూ స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీరేటును 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రిటైల్‌ సెగ్మెంట్‌లో దీర్ఘకాలిక కాలపరిమితి డిపాజిట్లపై రేట్లు 20 బేసిస్‌ పాయింట్లు, బల్క్‌ సెగ్మెంట్‌లో డిపాజిట్‌ రేట్లు 35 బేసిస్ పాయింట్లు తగ్గాయి. రూ. 2 లక్షలు ఆపైన బల్క్‌ డిపాజిట్లపై రేటును కూడా ఎస్‌బీఐ తగ్గించింది. తగ్గించిన తాజా రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. 



You may be interested

వ్యక్తిగత దివాలా నియంత్రణ దశలవారీగా...

Tuesday 30th July 2019

దివాలా కంపెనీలను కొన్న వాటిపై క్రిమినల్‌ చర్యలు ఉండవు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఐబీసీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం న్యూఢిల్లీ: మూడేళ్ల నాటి ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) చట్టంలో ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించగా, ఇందుకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిర్వహణ అవసరాలకు రుణాలిచ్చిన సంస్థల (అపరేషనల్‌ క్రెడిటార్స్‌)తో పోలిస్తే, సెక్యూర్డ్‌ రుణాలిచ్చిన వాటికి ప్రాధాన్యంపై తాజా సవరణలతో స్పష్టత రానుంది. దివాలా కంపెనీని ఒడ్డెక్కించేందుకు దాన్ని

ఇక అమెజాన్‌ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ

Tuesday 30th July 2019

  సెప్టెంబర్‌ నుంచి అందుబాటులోకి ! బెంగళూరు: ఆన్‌లైన్‌ దిగ్గజం, అమెజాన్‌డాట్‌కామ్‌ భారత్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఐటీ ఇండస్ట్రియలిస్ట్‌, నారాయణ మూర్తి స్థాపించిన కాటమరన్‌ వెంచర్‌ ఫండ్‌తో ఈ వ్యాపారానికి సంబంధించి ప్రస్తుతం అమెజాన్‌డాట్‌కామ్‌ చర్చలు జరుపుతోందని సమాచారం. . ఈ వ్యాపారంలోకి రావడానికి ఇప్పుడిప్పుడే ఉద్యోగులను నియమించుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో  పండుగల సీజన్‌ మొదలయ్యే సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులను

Most from this category