News


ఎస్‌బీఐ...15 బేసిస్‌ పాయింట్ల కోత

Thursday 8th August 2019
news_main1565241817.png-27627

ఆర్‌బీఐ రెపో తగ్గింపు నేపథ్యంలో- బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన రుణ రేటును (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత- ఎంసీఎల్‌ఆర్‌)ను 15 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) వరకూ తగ్గించింది. అన్ని కాలపరిమితలపై 0.15 శాతం రేటు తగ్గినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహన, గృహ, వ్యక్తిగత రుణాలకు ప్రామాణికంగా ఉన్న ఏడాది కాలవ్యవధి రుణ రేటు తాజా తగ్గింపుతో 8.40 నుంచి 8.25 శాతానికి పడింది. కొత్త రేట్లు ఆగస్టు 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ ప్రకటన తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ తమ క్యాష్‌ క్రెడిట్‌, ఓవర్‌డ్రాఫ్ట్‌ కస్టమర్లకు తమ రుణ రేటు 85 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. అయితే గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ఆర్‌బీఐ రెపోరేటు 1.1 శాతం తగ్గింది. 



You may be interested

ఆదుకోండి మహాప్రభో!!

Thursday 8th August 2019

ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి వాహనాలపై జీఎస్‌టీ తగ్గించండి కేంద్రానికి ఆటోమొబైల్ పరిశ్రమ విజ్ఞప్తి న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ

ఇకపై రోజంతా నెఫ్ట్ సేవలు ..

Thursday 8th August 2019

డిసెంబర్‌ నుంచి అమల్లోకి ముంబై: ఆన్‌లైన్‌ నగదు బదిలీ లావాదేవీలకు సంబంధించిన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్‌) విధానాన్ని ఇకపై ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి దీన్ని అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని పేమెంట్ సిస్టమ్ విజన్ 2021 పత్రంలో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా

Most from this category