News


ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు

Friday 27th March 2020
news_main1585283710.png-32704

  • ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌కుమార్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఉపశమన ప్యాకేజీని తీసుకొచ్చిందని ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌కుమార్‌ అన్నారు. పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1.7  లక్షల కోట్ల ప్యాకేజీని గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే. కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంటుందని రజనీష్‌కుమార్‌ అంచనా వేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ అసాధారణ పరిస్థితుల్లో ఉందని, భారత్‌ ఇందుకు మినహాయింపేమీ కాదన్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరైన మార్గం చూపుతుంది. ఇది చక్కగా రూపొందించిన ప్యాకేజీ. బలహీన వర్గాలు కనీస వసతుల విషయంలో ఇబ్బంది పడకూడదన్న ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తెలియజేస్తోంది’’అని రజనీష్‌ అన్నారు.   


అవసరమైన చర్యలు...
బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ప్యాకేజీ అవసరమైనంత సాయం అందిస్తుందని ఇండియన్‌ బ్యాంకు ఎండీ పద్మజ చుండూరు అభిప్రాయపడ్డారు. ‘‘ఆరోగ్య సంరక్షకులకు బీమా రక్షణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు సాయం, ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు ఎంతో అవసరమైనవి’’ అని పద్మజ తెలిపారు. 



You may be interested

ఆశల పల్లకిలో ఆటో రంగం

Friday 27th March 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమను కూడా ఆదుకుంటుందని  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన దేశీ ఆటో పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బీఎస్‌-6 నిబంధనలు అమలు, ద్రవ్యలభ్యత కొరత, అధిక బీమా వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా భారీ నష్టాల్లో కొనసాగుతోన్న ఆటో పరిశ్రమను కోవిడ్–19 (కరోనా) వైరస్ మరింత కుంగదీసింది. తాజా పరిణామాలతో ఈ రంగంలోని టాటా మోటార్స్‌, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ సంస్థల మనుగడ కూడా ప్రశ్నార్థకంలో

నిత్యావసరాలకు మాత్రమే ఓకే..

Friday 27th March 2020

ఇతర ఆర్డర్లకు నో.. ఈ-కామర్స్ సంస్థల నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ-కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. "నిత్యావసరాలు, హెల్త్‌కేర్‌, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాం. ఫ్యాషన్‌, మొబైల్‌, యాక్సెసరీస్‌, ఎలక్ట్రానిక్స్ తదితర నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా కొత్త ఆర్డర్లు తీసుకోబోము" అని పేటీఎం మాల్ ఒక

Most from this category