News


భారత్‌ రేటింగ్‌ యథాతధం!

Wednesday 4th December 2019
news_main1575433981.png-30045

ఎస్‌అండ్‌పీ రేటింగ్‌ ఏజన్సీ
భారత సావరిన్‌ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఎస్‌ అండ్‌ పీ తెలిపిందని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి చెప్పారు. ఇటీవలే మూడీస్‌ సంస్థ భారత అవుట్‌లుక్‌ను స్టేబుల్‌ నుంచి నెగిటివ్‌కు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్‌అండ్‌పీ మాత్రం భారత్‌కు ఇచ్చిన బీబీబీమైనస్‌ రేటింగ్‌ను స్థిర అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నట్లు తెలిపిందని చక్రవర్తి చెప్పారు. భారత్‌ దీర్ఘకాలిక వృద్ధిని సాధించగలదని ఎస్‌అండ్‌బీ అభిప్రాయపడిందన్నారు. జీడీపీలో తాజా మందగమనం తాత్కాలికమేనన్నారు. బీబీబీ రేటింగ్‌ విత్త అవసరాలను అందుకోగల ఎకానమీలకు ఇస్తారు. అయితే బలహీన ఆర్థిక వాతావరణం ఇలాంటి ఎకానమీలపై తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. ప్రస్తుతం ఎకానమీలో తీవ్ర మందగమన సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో ఎస్‌అండ్‌పీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం కొంతమేర ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌ మంచి ప్రదర్శన చూపగలదని, వచ్చే రెండేళ్ల పాటు బలమైన వృద్ధి చూపగలదని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. మరో రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ సైతం భారత్‌ అవుట్‌లుక్‌ను యథాతథంగా కొనసాగిస్తోంది. 



You may be interested

ఆల్ఫాబెట్‌ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌!

Wednesday 4th December 2019

గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుందర్‌ పిచాయ్‌, త్వరలో గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆల్ఫాబెట్‌ నాయకత్వ సీటు నుంచి తప్పుకుంటామని గూగుల్‌ వ్యవస్థాపకులు లారీపేజ్‌, సెర్గీబ్రిన్‌ ప్రకటించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు వారు లేఖ రాశారు. గూగుల్‌తో పాటు ఆల్ఫాబెట్‌కు చెందిన ఇతర సంస్థలు మంచి ప్రదర్శన చూపుతున్నాయన్నారు. ఇకపై తాము మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను అట్టిపెట్టుకొని వేలాడాలనుకోవడం లేదన్నారు. ఇకపై గూగుల్‌, ఆల్ఫాబెట్‌కు ఇద్దరు

ఐఐసీటీ ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థకు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

Wednesday 4th December 2019

యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ (ఐఐసీటీ) టెక్నాలజీలోని న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెజొనెన్స్‌ కేంద్రం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తనిఖీలను  విజయవంతంగా అధిగమించింది. ఈ మేరకు ఐఐసీటీ మంగళవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా మందులతోపాటు రసాయనాల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఈ న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెజొనెన్స్‌ స్పెక్ట్రోస్కొపీని ఉపయోగిస్తారన్నది తెలిసిందే. యూఎస్‌ ఎఫ్‌డీఏ ఈ కేంద్రాన్ని ఆగస్టు

Most from this category