News


రూపాయికీ కరోనా దెబ్బ!

Monday 24th February 2020
news_main1582519152.png-32034

ప్రారంభంలోనే 24 పైసలు డౌన్‌
72 సమీపానికి చేరిన రూపాయి

ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ కరెన్సీకి దెబ్బ తగిలింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  25 పైసలు క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 71.89 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. తదుపరి 71.90 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం కాస్త కోలుకుంది. 18 పైసలు బలహీనపడి 71.82 వద్ద ట్రేడవుతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం రూపాయి 10 పైసలు నీరసించి 71.64 వద్ద ముగిసింది. తద్వారా ఏడు వారాల కనిష్టానికి చేరింది. రూపాయి ఇంతక్రితం జనవరి 8న ఈ స్థాయికి చేరింది.

పసిడి ప్లస్‌
కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు మందగించి డిమాండ్‌ తగ్గవచ్చన్న అంచనాలతో ముడిచమురు ధరలు దాదాపు 3 శాతం పతనమయ్యాయి. మరోపక్క బంగారానికి డిమాండ్‌ పెరిగింది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔస్స్‌(31.1 గ్రాములు) బంగారం ధర 1.2 శాతం పుంజుకుని 1669 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ 1678 డాలర్లను తాకింది. సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా బంగారాన్ని భావించే సంగతి తెలిసిందే. కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ తదితర సంస్థలు బం‍గారం కొనుగోలుకి ఆసక్తి చూపడంతో పసిడి ధరలు మెరుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా..లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 2.5 శాతం పతనమై 57 డాలర్లను తాకగా.. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం​2.4 శాతం క్షీణించి 52 డాలర్ల స్థాయికి చేరింది. మరోవైపు యూరో, జపనీస్‌ యెన్‌ వంటి కరెన్సీలు సైతం బలహీనపడ్డాయి.
 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Monday 24th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌: ఈ కంపెనీ కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ సమావేశం సోమవారం జరగనుంది. యస్‌ బ్యాంక్‌: హిందుజా గ్రూపు సెర్బ్రస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌ మెంట్‌తో కలిసి యస్‌ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.  బయోకాన్‌: ఈ కంపెనీ యూఎస్‌డీఎఫ్‌ఏ నుంచి మూడు పరిశీలనలను అందుకున్నట్లు వెల్లడించింది. మలేసియాలోని ఇన్సులిన్‌ తయారీ కేంద్రంలో అమెరికా హెల్త్‌ రెగ్యులేటరీ సంస్థ ఫిబ్రవరి

భగ్గుమన్న బంగారం

Monday 24th February 2020

కరోనా వైరస్‌ భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భగ్గుమనడంతో సోమవారం దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శనివారం ముగింపుతో పోలిస్తే రూ.383పెరిగి 10 గ్రాముల పసిడి రూ.43049 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.43000కు చేరడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో 15 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,663.60 డాలర్ల వద్ద

Most from this category