News


రూపాయి పతనం, మొండిబకాయిలతో ఇబ్బందే

Monday 22nd October 2018
news_main1540183811.png-21345

న్యూఢిల్లీ: అంతకంతకూ పడిపోతున్న రూపాయి విలువ, బ్యాంకుల్లో మొండిబకాయిలు పేరుకుపోతుండటం ఆందోళనకలిగించే అంశాలేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. పాలనపరమైన లోపాలు, పలు రాష్ట్రాల్లో ప్రజా ఆందోళనలు, లౌకికవాదాన్ని దెబ్బతీసేవిధంగా చేస్తున్న ప్రకటనలతో దేశం సతమతమవుతోందని జలాన్‌ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చుతాయన్నారు. ప్రధానంగా వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ), దివాలా చట్టం, ప్రభుత్వ పథకాలకు నగదు బదిలీ వంటివి ఇందులో ప్రధానమైనవని చెప్పారు. ‘వర్థమాన దేశాలన్నింటికెల్లా మన ఆర్థిక వృద్ధి రేటు అత్యధిక స్థాయిలో ఉండటం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కచ్చితంగా సానుకూల అంశాలే. అయితే, వ్యవసాయోత‍్పత్తులకు మద్దతు ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆహారోత్పత్తుల ధరలు పెరిగి గ్రామీణ, చిన్న పట్టణాల్లో పేద ప్రజలపై తీవ్ర ప్రభావానికి దారితీస్తుంది. ఇక రూపాయి పతనం వల్ల పెద్ద ముప్పేమీ లేనప్పటికీ... గత కొద్ది నెలల్లో కరెన్సీ విలువ తీవ్రంగా పడిపోవడం అనేది ఆందోళనరమైన అంశమే. మొండిబకాయిల సమస్యకు ఆర్‌బీఐ చర్యలు, దివాలా చట్టంతో తగిన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. ఎయిరిండియా ప్రైవేటీకరణకు మరికొంత సమయం పట్టొచ్చు. ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల రుణ భారాన్ని ఎలా పరిష్కరిస్తారన్న దానిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి’ అని జలాన్‌ పేర్కొన్నారు.You may be interested

బ్యాంకుల్లో తగ్గిన ఫండ్స్‌ పెట్టుబడులు

Monday 22nd October 2018

న్యూఢిల్లీ: మార్కెట్లో కరెక్షన్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు సెప్టెంబర్‌లో 21,600 కోట్ల మేర తగ్గిపోయాయి. సెప్టెంబర్‌ చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు రూ.1,88,620 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల ఆగస్ట్‌ నాటికి రూ.2,10,251 కోట్లుగా ఉండడం గమనార్హం. జూన్‌ నుంచి చూసుకుంటే ఇదే తక్కువ. జూన్‌లో బ్యాంక్‌స్టాక్స్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు 1.87 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. శాతం వారీగా చూసుకుంటే ఫండ్స్‌ మొత్తం

రూ. 1,000 కోట్ల సమీకరణలో ముత్తూట్ మైక్రోఫిన్

Monday 22nd October 2018

న్యూఢిల్లీ:  ముత్తూట్ పపచన్‌ గ్రూప్‌లో భాగమైన ముత్తూట్ మైక్రోఫిన్‌ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రావాలని యోచిస్తోంది. దీని ద్వారా సుమారు రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న మార్కెట్ పరిస్థితులు అప్పటికల్లా సర్దుకోగలవని సంస్థ ఆశిస్తున్నట్లు తెలిపాయి. ఉత్తరాదిలో కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించాయి. ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీవో ప్రతిపాదనకు ఇటీవలే మార్కెట్ల

Most from this category