News


బ్యాంకింగ్‌ రంగానికే రిస్కు!

Wednesday 14th August 2019
news_main1565766482.png-27760

ఆర్‌బీఐ ప్రతిపాదనలపై ఫిచ్‌ హెచ్చరిక
బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలకు, రిటైల్‌ రుణగ్రహీతలకు మరిన్ని రుణాలు ఇచ్చేలా ఆర్‌బీఐ ఇటీవల చేపడుతున్న ప్రోత్సాహక చర్యలు అంతిమంగా బ్యాంకింగ్‌ రంగానికి రిస్కులను పెంచుతాయని అంతర్జాతీయ రేటింగ్‌ఏజన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. మందగమన నేపథ్యంలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ ఈ తరహా చర్యలను రూపొందిస్తోంది. కానీ ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుపగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్‌ రిస్కును అంగీకరించాల్సివస్తుందని ఫిచ్‌ తెలిపింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులకు లింకేజ్‌ను తుంచేయాలని ప్రయత్నాలు జరుగుతున్న సమయాన, భారత్‌లో ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ప్రోత్సహించడం మంచిదికాదని తెలిపింది. బ్యాంకుల పరిధిలోలేని ఎకానమీలోని విభాగాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకుల్లోని సేవింగ్స్‌ను ఉపయోగించడం విత్త సమ్మేళనంలో భాగంగా ఆర్‌బీఐ చెబుతోంది. కానీ ఇందువల్ల ఎన్‌బీఎఫ్‌సీల అంతర్గత సంక్షోభ ప్రభావం బ్యాంకులపై పడుతుందని ఫిచ్‌ తెలిపింది. రిస్కు వెయిటేజ్‌ల్లో తగ్గింపు లోన్‌గ్రోత్‌కు పాజిటివ్‌ విషయమే కానీ, క్రెడిట్‌ ప్రొఫైల్‌కు నెగిటివ్‌ అంశమని పేర్కొంది. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటపడిన తర్వాత ఎన్‌బీఎఫ్‌సీల్లో భారీ లిక్విడిటీ ఇబ్బంది ఎదురైంది. దీంతో  మొత్తం వ్యవస్థలోనే మందగమన ఛాయలు ఏర్పడ్డాయి. 



You may be interested

రెండేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Wednesday 14th August 2019

టోకు ధరల ద్రవ్యోల్బణం జూలైలో 26 నెలల కనిష్టస్థాయికి దిగివచ్చింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం జూలై టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) గణాంకాలను విడుదల చేసింది. ఇంధన, విద్యుత్‌ ధరలు దిగిరావడంతో ఈ జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.08శాతానికి పరిమితమైంది. అంతకు ముందు జూన్‌ మాసంలో ఇది 2.02శాతంగా నమోదైంది. వరుసగా రెండో నెలలో కూడా తగ్గిన  టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) గణాంకాలు వివరాలు ఇలా ఉన్నాయి. 1. ప్రైమరీ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం

ఫార్మా షేర్లకు జర్వం

Wednesday 14th August 2019

7శాతం క్షీణించిన సన్‌ ఫార్మా 7ఏడేళ్ల కనిష్టానికి గ్లెన్‌మార్క్‌ మార్కెట్‌ లాభంతో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఫార్మా రంగ షేర్లు బుధవారం భారీ నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు 3శాతం పతనమైంది. ఈ రంగంలో అదిక వెయిటేజీ కలిగిన డాక్టర్‌ రెడ్డీస్‌, గ్లెన్‌మార్క్‌, సన్‌ ఫార్మా షేర్ల క్షీణత ఇండెక్స్‌ భారీ పతనానికి కారణమైంది. ఈ క్యూ1లో ఫార్మా కంపెనీల ఫలితాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో

Most from this category