STOCKS

News


ఆర్‌బీఐకి ఉల్లిఘాటు తగిలేనా?!

Wednesday 13th November 2019
news_main1573628640.png-29556

ద్రవ్యోల్బణం 4 శాతం దాటే అవకాశం
ఆహార పదార్ధాల ధరల పెరుగుదలే కారణం 
ఉల్లి ధరల ఘాటుకు ఆర్‌బీఐ పెట్టుకున్న ద్రవ్యోల్బణ టార్గెట్‌ కకావికలం కానుందా? అవునని అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే ద్రవ్యోల్బణం టార్గెట్‌కు అటుఇటు అయినంత మాత్రాన ఆర్‌బీఐ తక్షణమే తన మానిటరీ పాలసీలో మార్పులు చేయకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 4.35 శాతం ఉండొచ్చని బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో 33 మంది ఎకనమిస్టులు అంచనా వేశారు. ఇదే నిజమైతే 2018 జూలై తర్వాత సీపీఐ ద్రవ్యోల్బణం 4 శాతాన్ని దాటినట్లు కానుంది. అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆహారోత్పత్తుల ధరలేనని, ఎకానమీలో డిమాండ్‌ను సూచించే అంతర్లీన ద్రవ్యోల్బణం మందకొడిగానే ఉందని విధాన నిర్ణేతలు భావించేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్లీన ద్రవ్యోల్బణం మందకొడిగా ఉందనేందుకు అక్టోబర్‌ పారిశ్రామికోత్పత్తి  డేటా నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. జీడీపీ రేటు జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి పరిమితం కావడంతో ఆర్‌బీఐ వృద్ధికి ఊతమిచ్చేలా పాలసీ మీటింగ్‌లో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ ఏడాది ఆర్‌బీఐ ఐదుమార్లు రేట్లు తగ్గించింది. ఇందువల్ల ఇకపై రేట్‌ కట్‌ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చని వచ్చే మార్చికి మరికొంత తగ్గి 4.9 శాతానికి రెపో పరిమితం కావచ్చని ఎకనమిస్టుల అంచనా. 
కేవలం సీపీఐ ద్రవ్యోల్బణం పెరిగినంత మాత్రాన ఆర్‌బీఐ తన పంథా మార్చుకోకపోవచ్చని, ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆహార పదార్ధాల ధరలు(ఉల్లి తదితరాలు) పెరగడమేనని నిర్మల్‌బ్యాంక్‌ తదితర బ్రోకరేజ్‌ల అనలిస్టులు పేర్కొన్నారు. డిసెంబర్‌ సమావేశంలో ఆర్‌బీఐ 15 శాతం మేర రేట్లను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెల 29న సెప్టెంబర్‌ త్రైమాసిక జీడీపీ వివరాలు వస్తాయి. ఆర్‌బీఐ తదుపరి చర్యలు దీని ఆధారంగా ఉంటాయని నిపుణుల భావన. పెరిగిపోతున్న ఆహార ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ ధరలు స్థిరీకరించి మార్చి నాటికి టార్గెట్‌ 4 శాతం దాటకుండా ద్రవ్యోల్బణం కట్టడి చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. పైగా ఈ ఏడాది వర్షపాతం కూడా బాగున్నందున ఆహారపదార్ధాల ధరల పెరుగుదల తాత్కాలికమే కావచ్చని, త్వరలో ఈ ధరలు దిగివస్తాయని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. వృద్ధి మందగమనం దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ తదుపరి చర్యలుంటాయని, తాజా ద్రవ్యోల్బణ పెరుగుదల పెద్దగా లెక్కలోకి రాకపోవచ్చని వీరి భావన.You may be interested

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Wednesday 13th November 2019

అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ స్టాక్‌ సిఫార్సులు ... బ్రోకరేజి: క్రెడిట్‌ సూసీ అదాని పోర్టు: ఈ కంపెనీ షేరుపై క్రెడిట్‌ సూసీ ‘ఔట్‌ఫెర్ఫర్మ్‌’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అంతేకాకుండా కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ. 480 గా నిర్ణయించింది. బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌ ఆధారిత వృద్ధి తగ్గినప్పటికి కంపెనీ కంటైనర్‌ వృద్ధి హేతుబద్ధంగా ఉందని ఈ బ్రోకరేజి తెలిపింది. దామ్రా, కట్టుపల్లి పోర్టుల పనితీరు వలన కంపెనీ మంచి వృద్ధిని నమోదుచేస్తుందని ఈ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ పోటాపోటీ..!

Wednesday 13th November 2019

స్వల్ప హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్న బుధవారంనాటి మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగి, భారత్‌ మార్కెట్లో అత్యధిక మార్కెట్‌ కేపిటలైజేషన్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ షేర్లు పోటాపోటీగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్‌ అయిన నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని టాప్‌-5 గెయినర్లలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తరువాతి స్థానాల్లో ఈ రెండు షేర్లు  ట్రేడ్‌ అవుతున్నాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు నిఫ్టీలో వెయిటేజీ తక్కువకాగా, అధిక వెయిటేజి కలిగిన  రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్లు చెరో 3శాతం ర్యాలీ చేయడం

Most from this category