News


పన్ను మినహాయింపులు పొడిగించాలి

Thursday 23rd January 2020
news_main1579748407.png-31113

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పతనమైంది. గత క్యూ3లో రూ.225 కోట్లుగా ఉన్న ఈ బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ3లో 69 శాతం పతనమై రూ.70 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు కూడా బాగా పెరిగాయని, అందుకే నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. 
నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్‌...
గత క్యూ3లో రూ.655 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ3లో 41 శాతం వృద్ధితో రూ.923 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 1.38 శాతం నుంచి 3.33 శాతానికి పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 0.72 శాతం నుంచి 2.07 శాతానికి ఎగిశాయి. మొండి బకాయిలు భారీగా పెరగడంతో కేటాయింపులు రూ.161 కోట్ల​ నుంచి రూ.638 కోట్లకు చేరాయి. అయితే నికర వడ్డీ మార్జిన్‌ 4.12 శాతం నుంచి 4.57 శాతానికి పెరిగింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ అహుజాను మళ్లీ నియమించామని, వచ్చే నెల 21 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని బ్యాంక్‌ వెల్లడించింది. 



You may be interested

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,560 కోట్లు

Thursday 23rd January 2020

15 శాతం వృద్ధి  మొత్తం ఆదాయం రూ.36,718 కోట్లు న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.2,560 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం (రూ.2,219 కోట్లు)తో పోలిస్తే 15 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. పన్ను వ్యయాలు 37

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 69 శాతం డౌన్‌

Thursday 23rd January 2020

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పతనమైంది. గత క్యూ3లో రూ.225 కోట్లుగా ఉన్న ఈ బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ3లో 69 శాతం పతనమై రూ.70 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు కూడా బాగా పెరిగాయని, అందుకే నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది.  నికర వడ్డీ

Most from this category