News


వృద్ధి బాటపైకి సేవల రంగం: పీఎంఐ

Tuesday 6th August 2019
news_main1565072758.png-27570

న్యూఢిల్లీ: భారత సేవల రంగం జూలైలో​తిరిగి వృద్ధి బాటపైకి వచ్చినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. జూలైలో ఈ సూచీ 53.8 గా నమోదయ్యింది. జూన్‌లో ఈ సూచీ కేవలం 49.6 వద్ద ఉంది. పీఎంఐ ప్రకారం... సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. జూలై నెలలో పెరిగిన ఆర్డర్లు సేవల రంగాన్ని తిరిగి వృద్ధి పథంలోకి తీసుకువచ్చినట్లు సర్వే పేర్కొంది. ఉపాధి కల్పన మెరుగుకూ ఈ అంశం సానుకూలమని తెలిపింది. 

సేవలు, తయారీ కలిపినా... ఓకే...
కాగా తయారీ, సేవలు కలిసిన పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా జూలైలో సానుకూలత నమోదుచేసుకుంది. ఏకంగా ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి సూచీచేరి 53.9గా నమోదయ్యింది. సేవల రంగం దన్ను దీనికి ప్రధాన కారణం. జూన్‌లో ఈ సూచీ కేవలం 50.8 వద్ద ఉంది. భారత్‌ ఉపాధి కల్పన క్రమంగా పుంజుకుంటోందని సర్వే తెలిపింది.  తయారీ రంగం జూలైలో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఒక్క తయారీ రంగం చూసినా, జూలైలో మంచి ఫలితాన్ని ఇచ్చింది. సూచీ 52.5గా నమోదయ్యింది. జూన్‌లో ఈ సూచీ 52.1గా ఉంది. కొత్త ఆర్డర్లు రావడం, ఉత్పత్తి పటిష్టత తాజా సూచీ మెరుగుకు కారణం. సోమవారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. 



You may be interested

రేటు కోత అంచనాలే అధికం

Tuesday 6th August 2019

- ఇదే జరిగితే 5.5 శాతానికి రెపో - ఆర్‌బీఐ ద్రవ్య పరపతి  విధాన కమిటీ సమావేశం ప్రారంభం న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం సోమవారం నాడు ప్రారంభమైంది. మూడు రోజులు ఈ సమావేశం జరుగుతుంది.  ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ఆర్థికవేత్తలు,

జమ్మూ కశ్మీర్‌ ప్రజల జీవనాన్ని మార్చేస్తుంది

Tuesday 6th August 2019

రాష్ట్రాభివృద్ధికి బాటలు కేంద్రం నిర్ణయాలను కొనియాడిన పారిశ్రామిక వర్గాలు న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఆ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని కల్పిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ రాష్ట్రంలో పెట్టుబడులకు వీలు కల్పించి, అభివృద్ధికి బాటలు వేస్తుందని అభిప్రాయం ‍వ్యక్తం చేశాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ విషయమై ట్వీట్లతో తమ స్పందన తెలియజేశారు.  ఆర్టికల్‌ 370ని ఉపసంహరణ జమ్మూ

Most from this category