News


టెలికం నుంచి రూ. 1.33 లక్షల కోట్ల వసూళ్లు

Sunday 2nd February 2020
news_main1580617351.png-31423

  • 2020-21 బడ్జెట్‌లో అంచనా

న్యూఢిల్లీ: స్పెక్ట్రం యూసేజి చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయీలు రూపంలో టెలికం రంగం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 1.33 లక్షల కోట్ల మేర రాగలవని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి కమ్యూనికేషన్స్ విభాగం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 58,687 కోట్లు రావొచ్చని బడ్జెట్‌లో పేర్కొంది. వాస్తవానికి ఇది రూ. 50,520 కోట్ల స్థాయిలో ఉండొచ్చని 2019-20 బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేసింది. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరంలో అంతకు రెట్టింపు వసూళ్లు నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కుంగుతున్న టెలికం రంగానికి తాజా బకాయీల కారణంగా మరో రూ. 1.47 లక్షల కోట్ల మేర భారం పడనుంది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములాను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశాలు ఇవ్వడం .. టెల్కోలకు అశనిపాతంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతి ఎయిర్‌టెల్ రూ. 35,586 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 53,038 కోట్లు కట్టాల్సి రానుంది. మిగతాది ప్రభుత్వ రంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌తో పాటు మూతబడిన మరికొన్ని టెలికం సంస్థలు కట్టాల్సి రానుంది. 



You may be interested

విదేశీ బొమ్మలు, పాదరక్షలు ప్రియం

Sunday 2nd February 2020

- దిగుమతి సుంకాలు పెంపు - ఫర్నిచర్‌, వాల్‌ ఫ్యాన్లపై కూడా న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి తోడ్పాటునిచ్చేలా దేశీయంగా తయారీ రంగానికి మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా కేంద్రం పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. వీటిలో బొమ్మలు, పాదరక్షలు, ఫర్నిచర్ తదితర ఉత్పత్తులు ఉన్నాయి. దిగుమతి సుంకం .. పాదరక్షలపై 25 శాతం నుంచి 35 శాతానికి, ఆటబొమ్మలు.. పజిల్స్‌ మొదలైన వాటిపై 20 శాతం నుంచి 60

ఇన్వెస్టర్లపై డివిడెండ్‌ ట్యాక్స్‌ భారం

Sunday 2nd February 2020

న్యూఢిల్లీ: కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) భారం తొలగనున్నది. డీడీటీని కంపెనీల నుంచి ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఇది సాహసోపేతమైన నిర్ణయమని, ఈ నిర్ణయం కారణంగా పెట్టుబడులకు ఆకర్షణీయంగా భారత్‌ అవతరిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. కంపెనీలపై డీడీటీని తొలగించడం కారణంగా ఏడాదికి రూ.25,000 కోట్ల ఆదాయం కోల్పోవలసి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించే డివిడెండ్లపై

Most from this category