News


ధరలు పైపైకి..!

Thursday 13th February 2020
news_main1581564183.png-31737

వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్‌ రిటైల్‌ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. 

కట్టుదాటి...!
రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’ లేదా ‘మైనస్‌ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ‍ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో  రిటైల్‌ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్‌ (4.62 శాతం), డిసెంబర్‌ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్‌లో తాకింది. ఆర్‌బీఐ పాలసీ విధానానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక.  2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన  ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా  ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు- రెపోను 135 బేసిస్‌ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. 


ధరల తీవ్రత తీరిది...
ఒక్క ఆహార ద్రవ్యోల్బణాన్ని చూస్తే, ఈ ఏడాది జనవరిలో ఈ పెరుగుదల రేటు 13.63 శాతం ఉంటే, డిసెంబర్‌లో 14.19 శాతంగా నమోదయ్యింది. 2019 జనవరిలో ఈ రేటు పెరక్కపోగా -2.24 శాతంగా ఉంది. ఈ  ఏడాది జనవరిలో కూరగాయల ధరలు 50.19 శాతం పెరిగితే, పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 16.71 శాతం పెరిగాయి. ప్రొటీన్‌ రిచ్‌ మాంసం, చేపల ధరలు 10.50 శాతం పెరిగాయి. గుడ్ల ధరలు 10.41 శాతం ఎగశాయి. ఫుడ్‌, పానీయాలు రెండింటితో కూడిన విభాగంలో ద్రవ్యోల్బణం 11.79 శాతం పెరిగింది. హౌసింగ్‌లో 4.20 శాతం ద్రవ్యోల్బణం ఉంది. ఫ్యూయెల్‌ లైట్‌ విభాగంలో ద్రవ్యో‍ల్బణం రేటు 3.66 శాతం. 



You may be interested

ఎకానమీకి వైరస్‌!!

Thursday 13th February 2020

ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు కట్‌ 2.2 శాతానికి కుదించిన ఈఐయూ కరోనా భయాలే కారణం న్యూఢిల్లీ: చైనాలో బైటపడిన కరోనా వైరస్‌ ధాటికి ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ వృద్ధి కుంటుపడనుంది. 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో వెల్లడించింది. "ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌ ముప్పుగా పరిణమించింది. ఇది మరింతగా ప్రబలకుండా నివారించేందుకు చైనా

పరిశ్రమలు వెనక్కి...!

Thursday 13th February 2020

యథా‘మైనస్‌’లోకి పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్‌లో 0.3 శాతం క్షీణత తయారీ, విద్యుత్‌ రంగాల ప్రధానపాత్ర ఆరేళ్ల గరిష్టస్థాయికి రిటైల్‌ ధరల మంట న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోతే... రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. ఆర్థిక, విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగిస్తున్న అంశాలివి. 2020-21 బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

Most from this category