STOCKS

News


రూ.2000 నోటు కనుమరుగు?

Monday 10th February 2020
news_main1581330398.png-31664

చలామణిలోకి పంపకుండా నిరోధిస్తున్న టాప్‌ బ్యాంకు
ప్రింటింగ్‌ అపేసిన ఆర్‌బీఐ
కస్టమర్లకు జరిపే విత్‌డ్రాయల్స్‌లో రూ.2000 నోటును ఇవ్వవద్దంటూ ప్రముఖ పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకు తన సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు సూచనలిచ్చినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ ఒక కథనంలో వెల్లడించింది. తమ ఏటీఎంల్లో సైతం ఈ నోటును ఉంచొదని బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు బ్యాంకు ఎంప్లాయిస్‌కు పంపిన ఈమెయిల్‌లో వివరాలను బిజినెస్‌ ఇన్‌సైడర్‌ బయటపెట్టింది. కస్టమర్లకు రూ.2000 నోటు ఇవ్వవద్దని బ్యాంకు పేర్కొంది కానీ కస్టమర్ల నుంచి అవే నోట్లు డిపాజిట్స్‌గా వస్తే తీసుకోమని తెలిపింది. దీంతో క్రమంగా వ్యవస్థ నుంచి రూ. 2000 నోటు చలామణి తగ్గించే యత్నాలు ఆరంభమైనట్లు తెలుస్తోందని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ తెలిపింది. రూ.2000 నోటు చలామణి తగ్గించే క్రమంలో నగదు కొరత రాకుండా ఏటీఎంల్లో రూ.100 నోట్లను పెంచే చర్యలు తీసుకోవాలని సదరు బ్యాంకు నిర్ణయించినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని బ్యాంకు వర్గాలు తోసిపుచ్చాయని తెలిపింది. రూ.2000 నోటు చలామణి నిలిపివేసే విషయమై ఆర్‌బీఐని సంప్రదించామని, ఇంకా సమాధానం రాలేదని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ తన కథనంలో తెలిపింది. కేవలం ఆ ఒక్కబ్యాంకే కాకుండా పలు పీఎస్‌యూ బ్యాంకుల వద్ద రూ.2000 నోట్లు తగ్గాయని, అవేవీ చలామణిలోకి ఈ నోట్లు ఇవ్వడం లేదని తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించింది. 
ఎందుకిలా...
పెద్ద నోట్ల రద్దు అనంతరం వ్యవస్థలో నగదు ఇబ్బందులు తట్టుకునేందుకే రూ. 2000 నోట్లు తీసుకువచ్చారు. కానీ ఆ తర్వాత దేశీయ ఎకానమీలోకి వెల్లువలా నకిలీ రూ.2000 నోట్లు వస్తున్నాయని ఎన్‌సీఆర్‌బీ(నేషనల్‌ క్రిమినల్‌ రికార్డ్స్‌ బ్యూరో) ఇటీవలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు చలామణిలోని దాదాపు 56 శాతం రూ. 2000 నోట్లను సీజ్‌ చేసినట్లు తెలిపింది. పైగా వ్యవస్థలో నల్లధనం ఎక్కువగా ఈ నోట్ల రూపంలో పేరుకుపోతున్నందున వీటి చలామణి తగ్గించే యత్నాలు జరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఆర్‌బీఐ గతేడాది అక్టోబర్‌ నుంచి రూ. 2000 నోటు ప్రింటింగ్‌ నిలిపివేసింది. ఇందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇవన్నీ అందులో భాగమేనన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువలో 31.2 శాతం, వాల్యూంలో 3 శాతం వాటా రూ.2000 నోట్లదే! 2018 మార్చి నాటికి వ్యవస్థలో మొత్తం 336.30 కోట్ల రూ.2000 నోట్లున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. క్రమంగా ఈ సంఖ్యను తగ్గించే యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఎకనమిస్టుల అంచనా!You may be interested

దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 6 శాతం డౌన్‌!

Monday 10th February 2020

గ్రేటర్‌ నోయిడా: ఈ జనవరిలో దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 6.2 శాతం పడిపోయాయి. జీడీపీ వృద్ధి నెమ్మదించడం, వాహన ధరలు పెరగడంతో వాహన కొనుగోలుదార్లపై ఒత్తిడిపడి దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు పడిపోయాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చర్స్‌( సియామ్‌) సోమవారం వెల్లడించింది. సియామ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ..గత ఏడాది జనవరిలో దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 2,80,091 యూనిట్లుగా ఉంటే ఈ ఏడాది జనవరిలో

భారీ ఆర్డర్లను దక్కించుకున్న అశోక్‌ లేలాండ్‌

Monday 10th February 2020

బ్రిటన్‌ నుంచి 37 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల ఆర్డర్ల రాక అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి చెందిన బ్రిటన్‌ అనుబంధ సంస్థ ఆప్టేర్ పీఎల్‌సీ 37 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల తయారీకి అక్కడి ప్రభుత్వం నుంచి ఆర్డర్లను దక్కించుకుంది. స్థానిక ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ టవర్‌ టాన్సిట్‌ గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సోమవారం కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది. ఈ ఉద్గారరహిత ఎలక్ట్రానిక్‌ డబుల్‌ డెక్కర్‌ వాహనాలను షేర్బర్న్

Most from this category