News


నియంత్రణ సంస్థ, ఆడిటర్లదే బాధ్యత

Friday 18th October 2019
news_main1571373915.png-28970

  • బ్యాంకుల్లో మోసాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పంజాబ్‌ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల్లో చోటు చేసుకున్న మోసాలకు.. నియంత్రణ సంస్థ, యాజమాన్యం, ఆడిటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. "పీఎంసీ బ్యాంకు కానీ.. మరే బ్యాంక్ అయినా కానీ వాటికి సంబంధించిన సమస్యలను పరిశీలించడం నియంత్రణ సంస్థల బాధ్యత. ఆడిటర్‌ కూడా బాధ్యత వహించాలి. అలాగే రోజువారీ కార్యకలాపాలు వర్యవేక్షించే మేనేజ్‌మెంట్‌ కూడా మోసాలకు బాధ్యత వహించాల్సిందే. ఈ విషయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంది. నిందితులు అరెస్టయ్యారు. వారి ఆస్తులను జప్తు చేయడం జరిగింది" అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఠాకూర్ చెప్పారు. పీఎంసీ బ్యాంకు విషయంలో రూ. 40,000 దాకా విత్‌డ్రా చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించిందని, 77 శాతం మంది ఖాతాదారులకు ఇది ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, యూపీఏ రెండో విడత పాలనలో మొండిబాకీలు భారీగా పెరిగిపోయాయని ఠాకూర్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక సంస్కరణలు ప్రవేశపెట్టి, అదనపు మూలధనం అందించి బ్యాంకులను మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.



You may be interested

ఓలా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలు ప్రారంభం

Friday 18th October 2019

తొలుత బెంగళూరులో కార్లు త్వరలోనే హైదరాబాద్‌లో సేవలు న్యూఢిల్లీ: ట్యాక్సీ ఆగ్రిగేటర్‌ ఓలా.. తాజాగా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలను ప్రారంభించింది. ‘ఓలా డ్రైవ్‌’ పేరిట తొలుత బెంగళూరులో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా ప్లే ప్లాట్‌ఫాంకు అనుసంధానమైన ఈ కార్లలో 24/7 హెల్ప్‌లైన్, అత్యవసర బటన్, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. రెండు గంటల పాటు కారును పొందడం కోసం సెక్యూరిటీ డిపాజిట్

నిఫ్టీ షార్ట్స్‌ తగ్గించుకుంటున్న ఎఫ్‌పీఐలు

Friday 18th October 2019

క్యాష్‌ మార్కెట్లో కొనుగోళ్లు పాజిటివ్‌ ట్రెండ్‌ అంటున్న నిపుణులు దీపావళి సమయానికి మార్కెట్‌ సెంటిమెంట్‌ మరింత పాజిటివ్‌గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాన సూచీలైన నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో షార్ట్‌ పొజిషన్లను ఎఫ్‌పీఐలు గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఒకపక్క షార్ట్స్‌ కవర్‌ చేస్తున్న విదేశీ మదుపరులు మరోపక్క అంతే వేగంతో క్యాష్‌ మార్కెట్లో కొనుగోళ్లు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు చివరకు ఎఫ్‌ఐఐల నికర షార్ట్‌ పొజిషన్లు

Most from this category