News


2020 చివరికి మాంద్యం..!!?

Wednesday 28th August 2019
news_main1566930959.png-28056

కార్వీ రాజీవ్‌ సింగ్‌ 
బంగారం ర్యాలీ కొనసాగుతుందని, బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈవో రాజీవ్‌సింగ్‌ సూచించారు. 2020 చివరి నాటికి మాంద్యం రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 

 

అంతర్జాతీయ ఆర్థిక రంగం మాంద్యంలోకి వెళుతోందా?
బ్యాంకు ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ ఫండ్‌ మేనేజర్‌ సర్వేలో తేలిందేమంటే... 34 శాతం మంది వచ్చే 12 నెలల్లో మాంద్యం రావచ్చని చెప్పారు. 2011 నుంచి చూస్తే ఇదే అత్యధికం. ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే అమెరికా ఇన్వర్టడ్‌ కర్వ్‌ ఈల్డ్‌ ఇటీవల ప్రతికూలంగా మారడం చూశాం. అంతర్జాతీయ వ్యాపార సైకిల్‌ విషయమై ఆందోళనలు ఉన్నాయి. చరిత్రలో దీర్ఘకాలికం పాటు కొనసాగినది ఇదే. చైనా, యూరోప్‌, జపాన్‌ డేటాను పరిశీలిస్తే బలహీనంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక డేటా బలంగా ఉన్నా కానీ, కొంత మేర క్షీణతను సూచిస్తోంది. ఈల్డ్‌ కర్వ్‌ ప్రతికూలంగా మారడం ఇలాగే కొనసాగితే అది మాంద్యం సంకేతమే అవుతుంది. అంతర్జాతీయంగా మాంద్యం తలెత్తితే భారతీయ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది. 2020 చివరి నాటికి లేదా 2021 ఆరంభం నాటికి మాంద్యం మొదలవుతుందని నేను భయపడుతున్నా. ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉండాలి కానీ అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

 

బంగారంలో ఈ స్థాయిలో ఇ‍న్వెస్ట్‌ చేసుకోవచ్చా?
మాంద్యం భయాలు, వాణిజ్య యుద్ధాలపై అనిశ్చితి, బలహీన మానిటరీ పాలసీల నేపథ్యంలో బంగారం మంచి పనితీరు చూపించొచ్చు. ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నది మా సూచన. మన ఆర్థిక వ్యవస్థ క్యూ2లో కనిష్ట స్థాయికి చేరి, ఆ తర్వాత నుంచి రికవరీ అవుతుందని అంచనా వేస్తున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు రికవరీ బలంగా ఉండేలా చేస్తాయి. మొదటి త్రైమాసికంలో ఆదాయాలు 10.8 శాతం పడిపోయాయి. గత రెండేళ్లలోనే ఇది దారుణ పనితీరు. ప్రధానంగా ఆటోమొబైల్‌, మెటల్స్‌ వల్లే ఈ బలహీనత. బ్యాంకులు, కన్జ్యూమర్‌ కంపెనీలు మంచి పనితీరు చూపించాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌ మెరుగ్గా ఉండొచ్చు.  ఆర్థిక రంగం రెండో క్వార్టర్‌లో స్థిరపడొచ్చు. క్యూ2లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని అంచనా. క్యూ1లో టీవీఎస్‌ మోటార్‌, బాటా ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ మంచి పనితీరు చూపించగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా ఎలెక్సి, ఎంవోఐఎల్‌, ఐచర్‌ మోటార్స్‌, కమిన్స్‌ ఇండియా పనితీరు బాలేదు.You may be interested

11,049 కోల్పోతే ప్రాఫిట్‌ బుకింగ్‌

Wednesday 28th August 2019

నిఫ్టీ రెండు వారాల గరిష్ట స్థాయిలో మంగళవారం క్లోజ్‌ అయింది. ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నిధులను డివిడెండ్‌గా బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ద్రవ్యలోటు ఆందోళనలను తేలికపరిచింది. దీనికితోడు అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు లేకపోవడం మార్కెట్లు సానుకూలంగా ముగియడానికి దోహదపడ్డాయి. నిఫ్టీ 11,049కి పైన నిలదొక్కుకుంటే తదుపరి 11,181 వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు చార్ట్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌.    ‘‘ఇండెక్స్‌ డైలీ చార్ట్‌లో డోజీ

రిస్క్ ఎందుకనుకుంటున్న ఇన్వెస్టర్లు!

Tuesday 27th August 2019

‘సాధారణ వర్షపాతం కొనసాగితే పంటలు బాగా పండుతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. దీనితో పాటు ప్రభుత్వం అందించే ఆర్థిక చర్యలు, బూస్టర్‌ ప్యాకేజిలు పట్టణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి’ అని సర్తి గ్రూప్‌, పార్టనర్‌, సీఐఓ కుంజ్ బన్సాల్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. అంతేకాకుండా నగదు లభ్యత కారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్‌లకు దూరంగా లేరని, రిస్కు తీసుకోవడం ఇష్టం లేకనే దూరంగా ఉన్నారని ఆయన

Most from this category