News


ప్రభుత్వ బ్యాంకుల నియమావళిని నవీకరించిన ఆర్బీఐ

Saturday 3rd August 2019
news_main1564808234.png-27515

పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు లేదా మునిసిపల్ కార్పొరేషన్ల వంటి స్థానిక సంస్థలలోని సభ్యులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులలో ఉండకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నవీకరించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రమాణాలలో పేర్కొంది. వీరితో పాటు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులోనైన చట్టబద్దమైన సెంట్రల్ ఆడిటర్లుగా పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థల భాగస్వాములు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులలో చేరడానికి అనర్హులని వివరించింది. ఈ తాజా నియమావళి ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బోర్డు సభ్యుల పోస్టుకు ప్రయత్నించే అభ్యర్థులు,  ప్రత్యర్థి బ్యాంకు లేదా ఆర్‌బిఐ లేదా ఇతర ఆర్థిక సంస్థలు, భీమా సంస్థలు లేదా వాణిజ్య బ్యాంకులు, స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన నాన్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు, సహకార బ్యాంకులు లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల బోర్డులలో సభ్యులుగా ఉండకూడదు. ఫైనాన్సింగ్, మనీ లెండింగ్, ఇన్వెస్ట్‌మెంట్, లీజింగ్, ఇతర పారా బ్యాంకింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రభుత్వ రంగ బ్యాంకు బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించడానికి వీలుకాదు. 
  నిర్వాహక నియంత్రణ లేనంతవరకు ఫైనాన్సియల్‌ సంస్థలలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ప్రభుత్వ రంగ బ్యాంకులలో డైరక్టర్ల పోస్టులకు అర్హులేనని ఆర్బిఐ తెలపింది. గతంలో ఏ బ్యాంక్‌లోనైనా, ఆర్థిక సంస్థలలోనైనా, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డులోనైనా ఆరేళ్లపాటు(వరుసగా లేదా మధ్యమధ్యలో) డైరెక్టర్‌గా పనిచేసినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకు బోర్డులో డైరక్టర్లుగా ఎన్నుకోడానికి లేదా తిరిగి ఎన్నుకోడానికి వీలుకాదని ఆర్బిఐ తెలిపింది. అంతేకాకుండా అభ్యర్థి స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలో పాల్గొనకూడదని వివరించింది. కనీస విద్యర్హత గ్రాడ్యుయేషన్‌ ఉండి, ఎన్నికలకు నామినేషన్లు సమర్పించే కట్‌ఆఫ్ తేదీ నాటికి అభ్యర్థి వయుస్సు 35 నుంచి 67 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపింది. 
  ఎన్నికైన డైరెక్టర్ మూడు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. తిరిగి ఎన్నికలలో పాల్గొనేందుకు అర్హులుగా ఉంటారు. అంతేకాకుండా మొత్తం ఆరు సంవత్సరాల పాటు డైరక్టురుగా సేవలందించే వీలుంటుంది(వరుసగా ఆరు​ఏళ్లు లేదా మొత్తంగా ఆరేళ్లు). ‘అభ్యర్థికి సంబంధిత బ్యాంకుతో చట్టపరమైన లేదా అడ్వైజరీ సేవలతో కలిపి ఎటువంటి వ్యాపార సంబంధాలు ఉండకూడదు లేదా బ్యాంకుతో వ్యాపార ప్రయోజనాలు పొందే కార్యకలాపాలలో పాల్గొనకూడదు’ అని ఆర్బిఐ వివరించింది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.3,203 కోట్లు

Saturday 3rd August 2019

46 శాతం వృద్ధి   రూ.12,996 కోట్లకు మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ. 3,204 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం, రూ.2,190 కోట్లుతో పోల్చితే 46 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,952 కోట్ల నుంచి రూ.12,996 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.2,190 కోట్ల నుంచి 43

ఐటీసీ లాభం రూ.3,437 కోట్లు

Saturday 3rd August 2019

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.3,049 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,437 కోట్లకు పెరిగిందని ఐటీసీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.11,746 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.12,532 ‍కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.7,668 కోట్ల నుంచి రూ.8,114 కోట్లకు చేరాయని వివరించింది.  డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ,

Most from this category