News


ద్రవ్యోల్బణ ఎఫెక్ట్‌: ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లు యథాతథమే..!

Thursday 23rd January 2020
news_main1579775765.png-31142

డిసెంబర్‌లో ద్రవ్యోల్బణ స్థాయి గణనీయంగా నమోదు కావడంతో ఫిబ్రవరిలో జరిగే ‍ద్రవ్యపరిపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని రాయిటర్‌ అధ్యయన నివేదికలో పేర్కోంది. ‘‘డిసెంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్టానికి చేరి 7.35శాతంగా నమోదైంది. జనవరిలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్య శ్రేణిని మించి ద్రవ్యోల్బణ గణంకాలు నమోదు కావడంతో వడ్డీరేట్ల తగ్గింపుపై పునరాలోచనలో పడింది.’’ అన్ని రాయిటర్స్‌  తెలిపింది. అయితే ఫిబ్రవరి 1వ తేదిన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌ మందగించిన ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరవచ్చనే ఆశాభావాన్ని రాయిటర్స్‌ వ్యక్తం చేసింది. ఇటీవల నిర్వహించి పోల్‌లో ఫిబ్రవరిలో కీలక వడ్డీరేట్లు యధాతథంగానూ, రెపోరేటు 5.15శాతంగానూ ఉండవచ్చని, ఇది అక్టోబర్‌ వరకు కొనసాగవచ్చని వెల్లడైంది

ఆసియాలోని అన్ని దేశాల్లో కన్నా ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపుపై ఎక్కువగా మక్కువ చూపుతుంది. ఏడాది కాలంలో ఏకంగా 135 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అయితే ద్రవ్యోల్బణ ఆందోళనలతో డిసెంబర్‌లో కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచింది. వచ్చే నెలలలో తదుపరి సమీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 6న ఆర్బీఐ సమీక్ష నిర్ణయాలు ప్రకటిస్తారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత జరగబోయే సమీక్ష కావడంతో దీనిపై మార్కెట్‌ వర్గాలకు సర్వత్రా ఆస్తక్తి నెలకొంది. సాధారణంగా ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా తీసుకుని వడ్డీరేట్లలో మార్పులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల అంశంపై ప్రముఖలు విశ్లేషకులు ఇలా ఉన్నాయి. 

ఆర్థిక వ్యవస్థపై అధిక ద్రవ్యోల్బణ ప్రభావం కనీసం ఏప్రిల్ వరకు కొనసాగవచ్చు. తదుపరి కొంత కట్టడి కావచ్చు. -హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీనియర్‌ ఎకనామిస్ట్‌ సాక్షి గుప్తా

క్రెడిట్‌లో పదునైన పుల్‌బ్యాక్ 2019 లో వృద్ధి గణనీయంగా మందగించింది. అయితే ఆర్థిక, ద్రవ్య విధానం సడలించబడింది. ఇది పెట్టుబడి, గృహ వ్యయంలో క్రమంగా కోలుకోవడానికి దారితీస్తుంది- క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ షాలిన్‌ షా 

ద్రవ్యోల్బణం రాబోయే 6-8 నెలలకు కనీసం లక్ష్యం కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు మరింత సమయం తీసుకోంటుంది- డీబీఎస్‌ ఎకనామిస్ట్‌ రాధికా రావ్‌ You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల జోరు

Thursday 23rd January 2020

ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ర్యాలీ గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనైతే, ఇతర రంగాల షేర్లు పెరిగాయి. వీటిలో అధికంగా పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు జోరు చూపించాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.24 శాతం పెరిగి  2,439.90 వద్ద ముగిసింది.సెంట్రల్‌ బ్యాంక్‌ 2.43 శాతంతో 19.00 వద్ద, స్టేట్‌

3 రోజుల నష్టాలకు చెక్‌- లాభాల ముగింపు

Thursday 23rd January 2020

సెన్సెక్స్‌ 271 పాయింట్లు జూమ్‌ నిఫ్టీ 73 పాయింట్లు అప్ రియల్టీ జూమ్‌- మీడియా డౌన్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లలో వరుస నష్టాలకు చెక్‌ పడింది. మూడు రోజుల అమ్మకాలకు బ్రేక్‌వేస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 271 పాయింట్లు ఎగసి 41,386 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు పుంజుకుని 12,180 వద్ద స్థిరపడింది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల అంచనాలకుతోడు, ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌జత కలవడంతో మార్కెట్లు

Most from this category