News


డిపాజిట్లపై బీమా పెంపు సమాచారం లేదు

Wednesday 4th December 2019
news_main1575431916.png-30041

- ఆర్‌బీఐ అనుబంధ విభాగం డీఐసీజీసీ ప్రకటన 
- ప్రస్తుతం రూ. లక్ష డిపాజిట్‌ వరకే బీమా రక్షణ
- రూ.5 లక్షల చేయాలన్న డిమాండ్లు
- పరిశీలనలో ఉందని ఇటీవల ఆర్థికమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ: బ్యాంక్‌ డిపాజిట్‌దారుడు ప్రస్తుతం రూ. లక్ష వరకూ మాత్రమే తన డిపాజిట్‌కు రక్షణ పొందగలుగుతాడు. ఇందులో ఎటువంటి మార్పూ లేదు.  బ్యాంక్‌లో వేసే డిపాజిట్లపై బీమా పెంపు సమాచారం ఏదీ తమకు లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుబంధ విభాగం డీఐసీజీసీ (డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌) స్పష్టంచేసింది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం బ్యాంక్‌ డిపాజట్లపై బీమా రక్షణ రూ. లక్ష వరకూ ఉంది. అయితే ఈ బీమా రక్షణను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని గతనెల్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందనీ సూచించారు. వ్యక్తిగత డిపాజిట్లకు సంబంధించి రూ. 5 లక్షల వరకూ బీమా పెంపు నిర్ణయం తీసుకోవాలని శంకర భారతీ అనే ఒక స్వచ్ఛంధ సంస్థ చేసిన డిమాండ్‌ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ ఈ ప్రకటన చేశారు. శంకర్‌ భారతీ ఆఫీస్‌ బేరర్లలో పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరివారు కావడం గమనార్హం. 

ఆర్‌టీఐ కింద డీఐసీజీసీ సమాచారం...
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచ్చిన ఒక దరఖాస్తుకు డీఐసీజీసీ సమాధారం ఇస్తూ, ‘‘బీమా పెంపునకు సంబంధించిన సమాచారం ఏదీ కార్పొరేషన్‌కు చేరలేదు’’ అని తెలిపింది. డీఐసీజీసీ చట్టం, 1961 సెక‌్షన్‌ 16 (1) ప్రకారం దివాలా చర్యల కిందకు వెళ్లిన బ్యాంక్‌కు సంబంధించిన ఒక డిపాజిట్‌దారునకు అసలు, వడ్డీతో కలిపి రూ. లక్ష వరకూ మాత్రమే బీమా ఉంటుంది. అంటే రూ.లక్షలోపు డిపాజిట్‌దారు తన సొమ్మును పూర్తిస్థాయిలో పొందగలుగుతాడు. రూ. లక్ష పైన ఎంత డిపాజిట్‌ ఉన్నా... సంబంధిత డిపాజిట్‌ దారుకు రూ. లక్ష మొత్తమే బీమా కింద అందుతుంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ బ్రాంచీలుసహా అన్ని కమర్షియల్‌ బ్యాంకులకు కార్పొరేషన్‌ నుంచి బీమా కవరేజ్‌ ఉంటుంది. సేవింగ్స్‌, ఫిక్డ్డ్స్‌, కరెంట్‌, రికరింగ్‌ అకౌంట్లు అన్నింటికీ ఇది వర్తిస్తుంది.  పలు బ్యాంకులు తీవ్ర మోసాల్లో ఇరుక్కుంటూ, ప్రజల పొదుపులను ఇబ్బందుల్లోకి నెడుతున్న నేపథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎంసీ బ్యాంక్‌ ఇటీవలే ఈ తరహా ఇబ్బందుల్లోకి జారిన విషయం ఇక్కడ గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.95,700కుపైగా మోసాలు బైటపడ్డాయి. ఈ కాలంలో ఇందుకు సంబంధించి దాదాపు 5,743 కేసులను గుర్తించినట్లు గతనెల్లో ఆర్థికమంత్రి స్వయంగా రాజ్యసభలో ప్రకటించారు. 
 You may be interested

తనఖా షేర్ల బదిలీ ఆపండి

Wednesday 4th December 2019

శాట్‌ను ఆశ్రయించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సెక్యూరిటీల బదలాయింపుపై స్టే విధిస్తూ  శాట్ మధ్యంతర ఉత్తర్వులు నేడు తుది ఆదేశాలు న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కార్వీకి రుణాలిచ్చిన బ్యాంకులకు ఊరటనిస్తూ సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ శాట్‌ ఆదేశాలిచ్చింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎస్‌ఎస్‌డీఎల్‌).. మరిన్ని షేర్లను కార్వీ క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించకుండా స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర

ఇక షావోమి... వ్యక్తిగత రుణాలు

Wednesday 4th December 2019

యాప్‌ ఆధారంగా రుణాలు ‘మీ క్రెడిట్‌’ పేరిట యాప్‌ విడుదల రూ. లక్ష వరకు లోన్‌ న్యూఢిల్లీ: చైనాకు చెందిన షావోమీ.. భారత్‌లో రుణ మంజూరీ సేవలను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇక్కడ మార్కెట్‌కు సుపరిచితమైన ఈ సంస్థ.. మొబైల్‌ అప్లికేషన్‌ ఆధారంగా వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మీ క్రెడిట్‌’ పేరిట యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రూ. లక్ష వరకు

Most from this category