News


ద్రవ్య లభ్యతపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి!

Wednesday 22nd May 2019
news_main1558509847.png-25883

  • ఫైనాన్షియల్‌ సంస్థల లిక్విడిటీ పర్యవేక్షణ
  • దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు

చెన్నై: బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) సహా ఫైనాన్షియల్‌ సంస్థలకు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి, తగిన సూచనలు చేయడానికి ఆర్‌బీఐలోనే అంతర్గతంగా ప్రత్యేక విభాగాన్ని (కేడర్‌) ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు తీవ్ర నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో జరిగిన ఆర్‌బీఐ 576వ సెంట్రల్‌బోర్డ్‌ సమవేశంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తీవ్ర ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గత నెల్లో కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఐ. శ్రీనివాస్‌ వ్యాఖ్యానించడమూ ఈ నిర్ణయానికి నేపథ్యం. 
ఆర్థి‍క పరిస్థితిపై చర్చ...
ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, సవాళ్లతోపాటు వివిధ అంశాలకు సంబంధించి ఆర్‌బీఐ కార్యకలాపాలపైనా బోర్డ్‌ సమావేశంలో చర్చ జరిగింది. నగదు నిర్వహణ, ప్రభుత్వంతో ఆర్‌బీఐ మధ్య సంబంధాలు వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. డిప్యూటీ గవర్నర్లు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌, విరాల్‌ వీ ఆచార్య, బీపీ కనూంగూ, మహేశ్‌ కుమార్‌ జైన్‌లతో పాటు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్లు భరత్‌ జోషి, సుధీర్‌ మాన్‌కంద్‌, మనీష్‌ సబర్వాల్‌, సతీష్‌ మరాథే, స్వామినాథన్‌ గురుమూర్తి, రేవతీ అయ్యర్‌, సచిన్‌ చతుర్వేదిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం తరఫున డైరెక్టర్లు, ఫైనాన్స్‌ సెక్రటరీ సుభాష్‌ చంద్ర గార్గ్‌, ఫైనాన్షియల్‌ సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు కూడా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. 



You may be interested

బలమైన ప్రభుత్వం వస్తే 13వేలకు నిఫ్టీ!

Wednesday 22nd May 2019

ప్రభుదాస్‌ లీలాధర్‌ అంచనా కేంద్రంలో బలమైన ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తే ఈ ఏడాదిలోనే నిఫ్టీ 13000 పాయింట్లను తాకుతుందని ప్రభుదాస్‌ లీలాధర్‌ రిటైల్‌ సీఈఓ సందీప్‌ రైచూర అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మార్కెట్లకు దిశానిర్ధేశం జరుగుతుందన్నారు. కేంద్రంలో బలమైన ఎన్‌డీఏ ‍ప్రభుత్వం లేదా కాంగ్రెస్‌ దన్నుతో బలమైన యూపీఏ ప్రభుత్వం వస్తే మార్కెట్లో భారీ ర్యాలీ ఉంటుందని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్‌ మద్దతుతో థర్డ్‌ఫ్రంట్‌

జెట్‌లో పెట్టుబడులపై హిందుజా ఆసక్తి

Wednesday 22nd May 2019

ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు నెల రోజుల్నించి కార్యకలాపాలు నిలిపివేసిన ప్రైవేట్ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను హిందుజా గ్రూప్ పరిశీలిస్తోంది. మంగళవారం ఈ విషయం ఒక ప్రకటనలో తెలియజేసింది. "జెట్‌ ఎయిర్‌వేస్‌లో అవకాశాలు పరిశీలిస్తున్నాం" అంటూ హిందుజా గ్రూప్ ఒక ప్రకటన జారీ చేసింది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జెట్‌ ఎయిర్‌వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రుణాలిచ్చిన

Most from this category