News


ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై రుసుముల తొలగింపు

Friday 7th June 2019
news_main1559887828.png-26148

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసే బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త ప్రకటించింది. ఆర్టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే నగదు బదిలీలపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు తెలిపింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బ్యాంకులు ఈ ప్రయోజనాలను తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆదేశించామని తెలిపింది.  దీంతో పాటు ఏటీఎం ఛార్జీలను కూడా పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. పెద్ద మొత్తంలో నగదు బదిలీ కోసం రియల్ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌(ఆర్టీజీఎస్‌)ను, రూ. 2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థను ఆన్‌లైన్‌ ఖాతాదారులు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధానాల ద్వారా నగదు బదిలీలు చేసినప్పుడు బ్యాంకులు కొంత ఛార్జీలు తీసుకుంటాయి. ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై రూ. 1 నుంచి రూ. 5 వరకు, ఆర్టీజీఎస్‌ లావాదేవీలపై రూ. 5 నుంచి రూ. 50 వరకు ఛార్జీలు వసూలు చేస్తోంది. సాధారణంగా బ్యాంకులు ఆర్‌టీజీఎస్‌ లావాదేవీపై 2- 10 రూపాయలు, నెఫ్ట్‌ లావాదేవీపై 2.5- 25 రూపాయల వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. తాజా ఆదేశాలతో ఈ చార్జీలు తొలగిపోనున్నాయి. ఇందుకు సంబంధించి వారంలోగా అన్ని బ్యాంకులకు సూచనలు జారీ చేస్తామని ఆర్‌బీఐ తెలిపింది. You may be interested

విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్‌!!

Friday 7th June 2019

జూలై 30న చైర్మన్‌గా పదవీ విరమణ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగింపు కుమారుడు రిషద్‌కు చైర్మన్‌గా బాధ్యతలు న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్‌ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్ ‍ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి

బ్యాంకుల మొండిచేయి!

Friday 7th June 2019

ఆర్‌బీఐ రేటు కోత ప్రక్రియకు శ్రీకారం చుట్టినా, బ్యాంకులు మాత్రం భారీ రేటు తగ్గింపులకు ఎటువంటి హామీలూ ఇవ్వకపోతుండడం గమనించాల్సిన విషయం. ఆర్‌బీఐ రేటు తగ్గింపు వృద్ధికి ఊతం ఇస్తుందని ఒకపక్క పేర్కొంటున్న బ్యాంకులు, అయితే  తాము ఏ మేరకు రేటు తగ్గింపును చేపడతాయన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు. తమకు అందివస్తున్న ప్రయోజనాన్ని కస్టమర్‌కు బదలాయించండంటూ స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ చేస్తున్న సూచనలను వాస్తవంలో అమలు చేయడంపై

Most from this category