News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై బ్యాంకుల ప్రతిపాదనకు ఆర్‌బీఐ ‘నో’

Saturday 19th October 2019
Markets_main1571468616.png-29003

-డిసెంబర్‌ త్రైమాసికంలో తగ్గనున్న బ్యాంకుల లాభాలు  
దివాన్‌ హౌసింగ్‌ పైనాన్స్‌కు(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణాలిచ్చిన బ్యాంకులు, రూ. 6,000 కోట్ల వరకు ప్రొవిజన్ల ఉపశమనాన్ని పొందేందుకు సిద్ధంచేసిన ప్రతిపాదనలను ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తిరస్కరించిందని పరిశీలకులు తెలిపారు. ఫలితంగా డిసెంబర్‌ త్రైమాసికానికిగాను ఈ బ్యాంకుల లాభం తగ్గనుంది. బ్యాంకులు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించి మొత్తంగా రూ. 40,000 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివున్నాయి. అందువలన ఈ రుణదాతలు డిసెంబర్‌ త్రైమాసికం చివరినాటికి 15 శాతం ప్రోవిజన్‌ను ఏర్పాటు చేయవలసివుంది. 
బ్యాంకుల ప్రతిపాదన..
    డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఇచ్చిన రుణాలలో కొంత భాగాన్ని ఈక్విటీలగా మార్చి కంపెనీలో 51 శాతం వాటాను కలిగివుండేలా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ఈ రుణదాతలు ప్రణాళికల్ని సిద్ధంచేశాయి. దీంతో కంపెనీలో ‘యాజమాన్య మార్పు’ జరుగుతుందని రుణదాతలు భావించాయని పరిశీలకులు తెలిపారు. కాగా ఒత్తిడిలో ఉన్న ఆస్తుల రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఆర్‌బీఐ జూన్‌ 7న విడుదల సర్కులర్‌లోని నిబంధనల ప్రకారం, కంపెనీ యాజమాన్యం మారితే, అదనంగా ప్రొవిజన్‌లను ఏర్పాటు చేయవలని అవసరం లేదు. కానీ ‘బ్యాంకు పుస్తకాలలో రుణాలు అలానే ఉంటాయి కాబట్టి ట్రస్ట్‌ ద్వారా ఈక్విటీలను కలిగివుండడం, యాజమాన్యం మార్పు కిందకి రాదని ఆర్‌బీఐ పేర్కొంది’ అని పరిశీలకులు తెలిపారు. ఎన్‌సీడీ(నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌)లను కూడా కలుపుకుంటే, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించి రూ. 47,000 కోట్ల ఎక్స్‌పోజర్‌లను బ్యాంకులు కలిగివున్నాయి. కాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మొత్తం రుణాలు రూ. 1 లక్ష కోట్లుగా ఉన్నాయి.  ‘ప్రస్తుతానికైతే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఎక్స్‌పోజర్‌ బ్యాంక్‌ పుస్తకాలలో ఎన్‌పీఏలుగా మారలేదు’ అని పరిశీలకులు తెలిపారు.  
   ‘ రుణదాతల ప్రతిపాదనను ఆర్‌బీఐ తిరస్కరించడంతో, వారి పుస్తకాలలో ఉన్న ఎక్స్‌పోజర్‌ ఆధారంగా 15 శాతం ప్రొవిజన్‌ను ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసివుంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై ఇప్పటివరకూ ఆర్‌బీఐ, ఎస్‌బీఐ(స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్పందించలేదు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించి ఎస్‌బీఐ రూ. 10,000 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివుంది. మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ల ఎక్స్‌పోజర్‌ అధికంగా ఉంది. రుణదాతల కన్సార్షియంకు యూనియన్‌ బ్యాంక్‌ నాయకత్వం వహిస్తుండగా, ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌లు క్రీయాశీలక కమిటీలో భాగంగా ఉన్నాయి. 
రిజల్యూషన్‌ ప్రణాళికపై ప్రతిష్టంభన..
    బ్యాంకింగేతర రుణదాతలు ఇంటర్‌క్రెడిటర్‌ ఒప్పందంపై సం‍తకాలు చేయకపోవడంతో, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రిజల్యూషన్‌ ప్రణాళిక ప్రతిష్టంభనకు గురయ్యింది. బ్యాంకింగేతర రుణదాతలు డీహెచ్ఎఫ్‌ఎల్‌కిచ్చిన రుణాలను ఎన్‌పీఏలుగా నిర్ధారించుకున్నప్పటికి, బ్యాంకులు మాత్రం వాటి రుణ పుస్తకాలలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణాలను ఎన్‌పీఏలుగా మార్చలేదు. కాగా పైనాన్సియల్‌ కంపెనీలు ఎన్‌పీఏలను ఎదుర్కొన్నప్పుడు, నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం ప్రొవిజన్‌ను ఏర్పాటు చేయవలసివుంటుంది. ఇది వారి నికర లాభాలు తగ్గడానికి కారణమవుతుంది. 



You may be interested

మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 19th October 2019

అమెరికాలో ట్రేడయ్యే ఇండియా ఏడీఆర్‌లు శుక్రవారం అక్కడి మార్కెట్లో మిశ్రమంగా ముగిశాయి. ఫార్మారంగానికి చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 2శాతం లాభపడింది. ఐసీఐసీఐ ఏడీఆర్‌ అరశాతం ర్యాలీ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 1శాతం నష్టపోయింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 0.21శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.20శాతం నష్టపోగా, విప్రో ఏడీఆర్‌ మాత్రం ఎలాంటి లాభ, నష్టాలకు లోనుకాకుండా స్థిరంగా ముగిసింది నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు:-  టెక్నాలజీ, ఇండస్ట్రీస్‌, కన్జూమర్‌ సేవల షేర్లలో అమ్మకాలతో

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 19th October 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11670.00 పాయింట్లతో పోలిస్తే అర పాయింటు నష్టంతో 11,669.50 నష్టంతో ఉంది. ఇక వచ్చేవారంలో స్టాక్‌ మార్కెట్ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సోమవారం(21న) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. నిన్నటి రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 246 పాయింట్ల లాభంతో 39,298

Most from this category