News


రేటు తగ్గింపు ఖాయం!

Wednesday 5th June 2019
news_main1559730866.png-26116

  • రేటు తగ్గింపు ఖాయం!

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష గురువారం జరగనుంది.  గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో జరగనున్న పరపతి కమిటీ సమావేశం రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6 శాతం) 35 బేసిస్‌ పాయింట్లవరకూ తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. శక్తికాంతాస్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే ఆర్‌బీఐ రెపోరేటు అరశాతం తగ్గిన సంగతి  తెలిసిందే. రేటు తగ్గింపు ఖాయమన్న అంచనాలకు ప్రధాన కారణాలను చూస్తే...

  • అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్దేశిత 4 శాతంలోపు కొనసాగుతోంది.-
  • మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణులు పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి.   దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మేనెల్లో ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి తగ్గిపోయాయి. -
  • గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది.-
  • ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు స్పీడ్‌కు రెపో రేటు తగ్గింపునకే అవకాశాలు ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల విశ్వాసం. You may be interested

రేట్‌ కట్‌ దిశగా ఫెడ్‌!

Wednesday 5th June 2019

సంకేతాలిచ్చిన జెరోమ్‌ పావెల్‌ భారీగా లాభపడ్డ యూఎస్‌ మార్కెట్‌ ఆర్థిక మందగమన భయాలు యూఎస్‌ ఫెడ్‌ను వడ్డీరేట్ల తగ్గింపు దిశగా అడుగులు వేయిస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎకానమీలో అవసరపడితే వడ్డీరేట్లను తగ్గిస్తామని ఫెడ్‌ చైర్మన్‌ జోరోమ్‌ పావెల్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌, చైనా మధ్య ట్రేడ్‌వార్‌ ముదిరిపోతున్న నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ట్రేడ్‌వార్‌ అంశాలు ఎప్పుడు, ఎలా పరిష్కారమవుతాయో తనకు తెలీదని చెప్పారు. అన్ని పరిస్థితులను యూఎస్‌

ఇంధనాల రిటైలింగ్‌లో పోటీకి ఊతం

Wednesday 5th June 2019

పెట్రోల్ బంకు లైసెన్సు  నిబంధనల సడలింపు మంచిదే పీఎస్‌యూల గుత్తాధిపత్యం తగ్గుతుంది ఇక్రా నివేదిక న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల ఏర్పాటు లైసెన్సుకు సంబంధించిన నిబంధనలను సడలించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఇంధనాల రిటైలింగ్ రంగంలో పోటీకి తోడ్పాటు లభిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (ఓఎంసీ) గుత్తాధిపత్యానికి గండిపడుతుందని, అవి కూడా పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడగలదని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్

Most from this category