News


4న మరో దఫా రేటు కోత?

Monday 30th September 2019
news_main1569814994.png-28610

  • విశ్లేషకుల అభిప్రాయం

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ అక్టోబర్‌ 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించనుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో.  జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం (0.25+0.25+0.25+35) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 4 శాతం దిగువన నిర్దేశిత లక్ష్యాల లోపు కొనసాగుతుండడం రెపో రేటు కోతకు కలిసి వస్తున్న అంశం. ఈ నేపథ్యంలోనే మరో దఫా రేటు కోతకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలకు అవకాశం లేదుకానీ, రెపో రేటు తగ్గింపునకు కొంత వీలుందని ఇటీవలే స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ పేర్కొనడం గమనార్హం. కార్పొరేట్‌ పన్ను కోతసహా ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. దీనితోపాటు దేశంలో పండుగల వాతావరణం ఉంది. ఆయా పరిస్థితుల్లో డిమాండ్‌ పెంపునకు 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయం వెలువడుతుందన్నది పలువురి విశ్లేషణ. కాగా బ్యాంకులు తమకు అందివచ్చిన రెపో రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకర్లు కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శలకు చెక్‌ పెట్టడానికీ ఇప్పటికే ఆర్‌బీఐ తగిన కీలక చర్య తీసుకుంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ బ్యాంకులు తమ రుణ రేట్లను తప్పనిసరిగా రెపో, తదితర ఎక్స్‌టర్నల్‌ రేట్లకు బదలాయించాలని ఆర్‌బీఐ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశలో పలు బ్యాంకులు ఇప్పటికే తగిన నిర్ణయాలూ తీసుకున్నాయి. You may be interested

హెచ్‌డీఐఎల్‌ ఎక్స్‌పోజరే ముంచింది!

Monday 30th September 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సంక్షోభానికి... రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు బ్యాంకు భారీగా రుణాలను సమర్పించుకోవడమేనని వెల్లడైంది. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్‌ అంగీకరించినట్టు సమాచారం. అంటే రుణ ఆస్తుల్లో 73 శాతాన్ని ఒకే ఖాతాకు బ్యాంకు ఎలా ఇచ్చిందన్నది

సెన్సెక్స్‌ కీలక మద్దతు 38,380

Monday 30th September 2019

పది శాతం ర్యాలీ జరపడం ద్వారా మార్కెట్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అంశాన్ని దాదాపు డిస్కౌంట్‌ చేసుకున్నట్లే. పన్ను లబ్ధి కలగకుండా పెరిగిన షేర్లు తగ్గడం, పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా డిస్కౌంట్‌ చేసుకోని షేర్లు మరింత పెరగడమే ఇక మిగిలింది. ఫలితంగా ఆయా షేర్ల హెచ్చుతగ్గులకు తగినట్లు కొద్దిరోజులపాటు మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. అటుతర్వాత సెప్టెంబర్‌ క్వార్టర్లో ఆర్థిక పలితాలే భవిష్యత్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలవు. మరోవైపు అమెరికా-చైనాల వాణిజ్య

Most from this category