News


అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు

Friday 3rd January 2020
news_main1578023239.png-30638

  • మనీ యాప్‌ను విడుదల చేసిన ఆర్‌బీఐ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- ఇక నుంచి అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఇందుకు అవసరమైన మొబైల్‌ ఎడెడ్‌ నోట్‌ ఐడెంటిఫయర్‌ (ఎంఏఎన్‌ఐ–మనీ) యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‘‘కలర్‌ బ్లైండ్‌నెస్, పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్లు కూడా గుర్తించేందుకు వీలుగా ఇండియన్‌ కరెన్సీ నోట్లలో ఇంటాగ్లియో ప్రింటింగ్, స్పర్శ, నోట్ల పరిమాణం, సంఖ్యలు, ఏక వర్ణ రంగులు, నమూనాలు’’ వంటివి ఉన్నాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 
యాప్‌ ఎలా పని చేస్తుందంటే?
యాప్‌లోని కెమెరాను ఆన్‌ చేసి నోట్ల మీద ఉంచగానే ఈ యాప్‌ కరెన్సీ నోట్ల మీద ఉండే మహాత్మా గాంధీ బొమ్మను, సిరీస్‌ను లేదా వెనక వైపున ఉండే నోట్‌ భాగాన్ని గుర్తిస్తుంది. నోట్‌ విలువ ఎంతనేది హిందీ, ఇంగ్లీష్‌ భాషలో ఆడియో ద్వారా తెలుపుతుంది. వినికిడి సమస్య ఉన్న వాళ్ల కోసం వైబ్రేషన్స్‌ ద్వారా కూడా చెబుతుంది. ఈ యాప్‌ పగలు, రాత్రి ఏ సమయంలో పని చేస్తుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ ఆఫ్‌లైన్‌లో, వాయిస్‌ ఆధారిత అపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా కూడా పని చేయటం ఈ యాప్‌ ప్రత్యేకతలు. 



You may be interested

రూపాయి నేలచూపు

Friday 3rd January 2020

మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు దేశీ కరెన్సీపైనా ప్రభావం చూపాయి. ఇరాక్‌లోని బాగ్దాద్‌పై అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సైతం నేలచూపులతో మొదలైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 20 పైసలు క్షీణించి 71.57 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.20 ప్రాంతం‍లో 17 పైసలు(0.25 శాతం) బలహీనపడి 71.54 వద్ద ట్రేడవుతోంది. గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయానికి

మీ మొబైల్‌ కొద్దిసేపు స్విచాఫ్‌ చేయండి..!

Friday 3rd January 2020

వివో సరికొత్త ప్రచార కార్యక్రమం న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్‌’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్‌ అంబాసిడర్‌ అమీర్‌ఖాన్‌తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్‌ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్‌ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు

Most from this category