News


రెపోరేట్‌ 35 బీపీఎస్‌ తగ్గించిన ఆర్‌బీఐ

Wednesday 7th August 2019
news_main1565160297.png-27603

లిక్విడిటీ పెంచడమే లక్ష్యం
ద్వైమాసిక సమీక్షా సమావేశంలో భాగంగా రెపోరేట్‌ను 35 బీపీఎస్‌ మేర తగ్గిస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన మానిటర్‌ పాలసీ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో రెపోరేట్‌  5.40 శాతానికి దిగివచ్చింది. ఆర్బీఐ పెట్టుకున్న దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ టార్గెట్‌కు దిగువనే నిజ ద్రవ్యోల్బణం కదలాడుతుండడంతో రేట్‌కట్‌కు ఆర్‌బీఐకి మార్గం సుగమమైంది. మార్కెట్‌ వర్గాలు 25 బీపీఎస్‌ రేట్‌కట్‌ ఉండొచ్చని అంచనా వేశాయి. గత మూడు సమావేశాల్లో ఆర్‌బీఐ వరుసగా 25 బీపీఎస్‌ చొప్పున రేట్లను తగ్గిస్తూ వచ్చింది. తాజా రేట్‌కట్‌తో మొత్తం నాలుగు సమావేశాల్లో 1.1 శాతం మేర రెపోరేట్‌ను తగ్గించినట్లయింది. పండుగసీజన్‌ ఆరంభం కాబోతున్న తరుణంలో వడ్డీరేట్లను తగ్గించి రుణసరఫరా పెంచాలని ఈ రేట్‌కట్‌తో బ్యాంకులకు ఆర్‌బీఐ పరోక్ష దిశానిర్ధేశం చేసింది. తాజా నిర్ణయంతో వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కొంతమంది అనలిస్టులు తాజా రేట్‌ కట్‌ 50 బీపీఎస్‌ ఉండాలని భావించినా, ఆర్‌బీఐ మాత్రం మరీ అంత దూకుడుగా వెళ్లలేదు. క్రమంగా రుతుపవనాలు విస్తరించి మంచి వర్షపాతం నమోదు కావడం కూడా ఆర్‌బీఐ దూకుడుగా వెళ్లకుండా అడ్డుకుంది. యూఎస్‌చైనా ట్రేడ్‌వార్‌ ఫలితంగా మరో రెండు మూడు త్రైమాసికాలు దేశీయంగా కూడా మందగమనం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈతరుణంలో వృద్ధి మందగించకుండా ఉండేందుకు ఆర్‌బీఐ రేట్‌కట్‌కు మొగ్గు చూపింది. ప్రపంచవ్యాప్తంగా రేట్‌కట్‌ సైకిల్‌ ఆరంభమైందని బోఫా ఎంఎల్‌ వ్యాఖ్యానించింది. ఇప్పటికీ దేశీయ రుణ రేట్లు ఎక్కువగానే ఉన్నాయని, ఆర్‌బీఐ రేట్‌కట్‌ను బ్యాంకులు కస్టమర్లకు అందించనంతవరకు పెద్దగా ప్రయోజనం ఉండదని బ్రోకింగ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. You may be interested

నిఫ్టీ విలువ ఇంకా ఎక్కువే: ఎమ్‌కే గ్లోబల్‌

Wednesday 7th August 2019

ఇన్సిస్టీట్యూషనల్‌ క్లయింట్‌ గ్రూప్‌ సీఈఓ సువీర్ చినాని, ఈక్విటీ స్ట్రాటజిస్ట్ హెడ్, ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ అండ్ రీసెర్చ్ సునీల్ తిరుమలై ఓ ఆంగ్ల చానెల్‌తో  మార్కెట్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.    మొత్తం ప్రాతిపదికన, వాల్యుషన్లు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేకపోవడంతో ఫండ్స్‌లో నగదు స్థాయిలు పెరుగుతున్నాయని, ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారని చినాని అన్నారు. తిరుమలై మాట్లాడుతూ..ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే కార్పోరేట్‌ ఆదాయాలలో ఎక్కువ డౌన్‌గ్రేడ్‌లు జరిగిన

నిరుత్సాహకర ఫలితాలు: ఇండియన్‌బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9శాతం క్రాష్‌

Wednesday 7th August 2019

ఫైనాన్స్‌, హౌసింగ్‌ రంగంలో సేవలు అందిస్తున్న ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ షేర్లు బుధవారం  9శాతం పతనయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడటం షేరు పతనానికి కారణమైంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ మొదటి క్వార్టర్‌ ఫలితాలు విడుదల చేసింది. ఈ క్యూ1లో కంపెనీ రూ.802 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో కంపెనీ సాధించిన రూ.1,055 కోట్లతో పోలిస్తే ఇది 24

Most from this category