News


వడ్డీరేట్లు యథాతధం

Thursday 5th December 2019
news_main1575527737.png-30072

మానిటరీ పాలసీ సమీక్షా సమావేశంలో వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించింది. వరుసగా ఆరోమారు కూడా ఆర్‌బీఐ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలకు భిన్నంగా రేట్లను యథాతధంగా ఉంచింది. దీంతో రెపో 5.15 శాతం, రివర్స్‌ రెపో 4.90 శాతం వద్ద కొనసాగనున్నాయి. కమిటీలోని అందరు సభ్యులు ఏకగ్రీవంగా రేట్లు యథావిధిగా ఉంచేందుకు అంగీకరించారు. దీంతో పాటు వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 2019-20 ద్వితీయార్ధ వృద్ధి 4.9- 5.5 శాతం ఉండొచ్చని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను సైతం తగ్గించింది. 2020-21 ప్రథమార్ధంలో వృద్ధి 5.9- 6.3 శాతం ఉండొచ్చని పేర్కొంది. సమీప భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న అభిప్రాయం ఆర్‌బీఐ వెలిబుచ్చింది. అక్టోబర్‌- మార్చి ద్రవ్యోల్బణ అంచనాలను 5.1 శాతానికి పెంచింది. అవసరమైనంత వరకు తమ ధృక్పథం సరళీకృతంగానే ఉంటుందని వ్యాఖ్యానించింది. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం అంచనాల కన్నా ఎక్కువగా ఉందని తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో మందగమనం కనిపిస్తోందని పేర్కొంది. దేశీయ ఎకానమీలో కొంతమేర రికవరీ సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ చెప్పారు. You may be interested

నష్టాల్లోకి బ్యాంకింగ్‌ రంగ షేర్లు

Thursday 5th December 2019

ఆర్‌బీఐ నిర్ణయం మార్కెట్‌ అంచనాలను ప్రతికూలంగా ఉండంటంతో సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లింది. ఆర్‌బీఐ నేడు కీలకమైన పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈసారి వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీంతో రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రేటు 4.90 వద్ద, బ్యాంక్‌ రేటు 5.40శాతం వద్ద కొనసాగుంది. అర్‌బీఐ అనూహ్య పరిణామంతో వడ్డీరేట్లపై ప్రత్యక్ష సంబంధం ఉన్న బ్యాంకింగ్‌ రంగ

లాభాల బాటలో ఐటీ షేర్లు

Thursday 5th December 2019

మరికొద్ది సేపట్లో ఆర్‌బీఐ పాలసీ వెలువడనున్న తరణంలో సూచీల ట్రేడింగ్‌ స్తబ్ధుగా సాగుతుంది. బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్ల ర్యాలీ సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. పాలసీ ప్రకటన అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో స్పష్టమైన కదలికలు గమనించవచ్చు. ఇక ఐటీ షేర్లు విషయానికొస్తే.., ఎన్‌ఎస్‌ఈలో ఈ ఐటీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,164.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవల ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ

Most from this category