News


జీడీపీ అంచనాలను 6.1% తగ్గించిన ఆర్‌బీఐ; 25 బీపీఎస్‌ రేట్‌ కట్‌

Friday 4th October 2019
news_main1570173694.png-28719

  ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)  పాలసీ సమీక్షలో భాగంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతానికి పరిమితం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంపీసీ వ్యవహరిస్తుందని ఆర్‌బీఐ పాలసీ కమిటీ తెలిపింది. ఎంపీసీ సభ్యులందరూ పాలసీ రెపో రేటును తగ్గించడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ సభ్యులలో చేతన్ ఘాటే, పామి దువా, మైఖేల్ దేబబ్రాత పాట్రా, శ్రీ బిభూ ప్రసాద్ కనుంగో, శ్రీ శక్తికాంత దాస్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఓటు వేయగా, రవీంద్ర హెచ్. ధోలాకియా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఓటు వేశారు. కాగా రేట్ల కోతకు ప్రతిస్పందనగా మార్కెట్‌లు పడిపోయాయి. మార్కెట్‌ వర్గాలు 25 బేసిస్‌ పాయింట్ల కంటే అధికంగా రేట్ల కోత ఉంటుందని అంచనావేశారని విశ్లేషకులు తెలిపారు. మధ్యాహ్నాం 12.15 సమయానికి నిఫ్టీ 50  37.60 పాయింట్లు కోల్పోయి 11,276.40 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 86.68 పాయింట్లు కోల్పోయి 38,020.19 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
135 బీపీఎస్‌ తగ్గిన రెపో రేటు..
  ప్రస్తుత రేట్ల కోతను పరిగణలోకి తీసుకుంటే..ఆర్‌బీఐ మొత్తంగా ఈ ఏడాదిలో వరుసగా ఐదు సమావేశాలలో 135 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతానికి చేరుకుంది. కాగా 2010 మార్చి తర్వాత ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. దీంతోపాటు రివర్స్‌ రెపో 4.90 శాతానికి చేరుకుంది. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండడంతో ఆర్‌బీఐకి మరోదపా రేట్లను తగ్గించే అవకాశం కలిగిందని విశ్లేషకులు తెలిపారు. 
జీడీపీ వృద్ధి అంచనాలు 6.1 శాతానికి..
ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(ఆర్థిక సంవత్సరం 2020) సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించడం గమనార్హం.  ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతంగా నమోదయ్యింది. ఇది ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం కంటే తక్కువ. దీంతోపాటు అంతర్జాతీయ వాణిజ్యం అనిశ్చితిలో ఉండడంతో పాటు , అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు రేట్లను తగ్గించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫలితంగా ఆర్‌బీఐ రేట్ల తగ్గించడం సులభమయ్యింది. 
   యుఎస్‌ సర్వీస్‌ సెక్టార్‌, ఉద్యోగ డేటా బలహీనంగా ఉండడంతో ఇంకో 50 బేసిస్‌ పాయింట్లను తగ్గించే సంకేతాలను యుఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ ఇచ్చింది. డిసెంబర్‌ నాటికి ఫెడ్‌ 50 బేసిస్‌ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని, అందుకోసమే అంతర్జాతీయంగా వివిధ కేంద్ర బ్యాంకులు రేట్లను తగ్గిస్తున్నాయని బ్యాంక్‌ ఆప్‌ అమెరికా పేర్కొంది. కాగా యుఎస్ సర్వీస్‌ సెక్టార్‌ డేటా బలహీనంగా ఉండడంతో గత సెషన్లో డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 122.42 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 26,201.04 కు చేరుకుంది. ఆర్‌బీఐ రెపో రేటుతో కలిసి ఉన్న ఎస్‌ఎంఈ, రిటైల్‌ రుణాలపై ప్రస్తుత రేటు​తగ్గింపు తక్షణమే అమలు కానుందని విశ్లేషకులు తెలిపారు.You may be interested

జీడీపీ కట్‌తో మార్కెట్‌ క్రాష్‌

Friday 4th October 2019

2వారాల కనిష్టాన్ని తాకిన నిఫ్టీ ఆర్‌బీఐ తాజా పాలసీలో వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, జీడీపీ అంచనాల్ని సైతం భారీగా 6.1 శాతానికి తగ్గించడంతో శుక్రవారం మధ్యాహ్నం మార్కెట్‌ నిలువునా పతనమయ్యింది. స్టాక్‌ సూచీలు రెండు వారాల కనిష్టస్థాయికి తగ్గాయి. సెప్టెంబర్‌ మూడోవారంలో కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగిన ర్యాలీ తర్వాత...సూచీలు ఇంత దిగువస్థాయికి తగ్గడం ఇదే ప్రధమం.  నేడు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో

లాభాల బాటలో అశోక్‌ లేలాండ్‌

Friday 4th October 2019

హిందుజా గ్రూపునకు చెందిన అశోక్‌‌‌‌ లేలాండ్‌‌‌‌ కంపెనీ షేర్లు శుక్రవారం 7.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.68.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో షేర్లు లాభాల బాటపట్టాయి. ఒక దశలో 7.50శాతం ర్యాలీ చేసి రూ.72.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు క్రితం ముగింపు(రూ.67.60) ధరతో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.70.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category