News


ఫైనాన్షియల్‌ మార్కెట్లు సాఫీగా పనిచేసేందుకు చర్యలు

Wednesday 4th March 2020
news_main1583292840.png-32256

  • కరోనా ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
  • ఆర్‌బీఐ ప్రకటన

ముంబై: దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నామని, ఫైనాన్షియల్‌ మార్కెట్లు సాఫీగా పనిచేసేందుకు అవసరమైతే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌బీఐ ప్రకటించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిణామాలను ఆర్‌బీఐ నిరంతరం సునిశితంగా పరిశీలిస్తోంది. ఫైనాన్షియల్‌ మార్కెట్లు సజావుగా నడిచేందుకు, మార్కెట్లలో విశ్వాసాన్ని కాపాడేందుకు, ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది’’ అంటూ ఆర్‌బీఐ ప్రకటన తెలియజేసింది. అవసరమైతే ప్రభుత్వంతో కలసి ఆర్థిక కార్యకలాపాలు మరింత మందగించకుండా విధానపరమైన చర్యలకు అవకాశం ఉంటుందన్న ఆర్‌బీఐ సంకేతాలు మంగళవారం క్యాపిటల్‌ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌కు దారితీయడం గమనార్హం.  ‘‘కరోనా వైరస్‌ వ్యాప్తితో అంతర్జాతీయంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లు అస్థిరతలను చవిచూస్తున్నాయి. రిస్క్‌ తీసుకునేందుకు వెనుకాడే సెంటిమెంట్‌ ఏర్పడడంతోపాటు, సురక్షిత సాధనాల వైపు ప్రయాణం చేసేలా చేస్తున్నాయి’’అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. దేశీయంగా రెండు కొత్త కరోనా వైరస్‌ కేసులు నమోదు కావడం, అంతకుముందు అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు కరోనా చేరిందన్న వార్తలతో గత పది రోజుల్లో ‍స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. 



You may be interested

మరో రూ. 8వేల కోట్లు కట్టిన టెల్కోలు

Wednesday 4th March 2020

ప్రభుత్వంతో మరోసారి వొడా-ఐడియా సీఈవో భేటీ న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలు మంగళవారం మరో రూ. 8,000 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. వొడాఫోన్ ఐడియా రూ. 3,043 కోట్లు, భారతి ఎయిర్‌టెల్ రూ. 1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ. 1,053 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 2,000 కోట్లు కట్టాయి. ఇప్పటికే పూర్తి సెటిల్‌మెంట్ కోసం రూ. 2,197 కోట్లు కట్టామన్న టాటా టెలీసర్వీసెస్‌.. ఒకవేళ లెక్కల్లో

పసిడి పరుగే... పరుగు!

Wednesday 4th March 2020

అంతర్జాతీయంగా 50 డాలర్లకుపైగా పెరుగుదల దేశంలోనూ రూ.1,000కి పైగా అప్‌ రూపాయి ‘బలహీనత’ మరోబలం ఆర్థిక మందగమనం, కరోనా కష్టాల నేపథ్యంలో సరళతర ద్రవ్య విధానాలు అవలంభించడానికి సంబంధించి మీమాంస తగదని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌పై అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారంనాటి విమర్శలు,  ఆయా అంశాల నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు తప్పదన్న ఊహాగానాలు, ఇందుకు అనుగుణంగా మంగళవారం నిర్ణయం నేపథ్యంలో పసిడి గడచిన రెండు రోజుల్లో తిరిగి భారీగా పెరిగింది. మంగళవారం అమెరికా

Most from this category