News


తొమ్మిదేళ్ల తర్వాత బంగారాన్ని కొన్న ఆర్‌బీఐ

Tuesday 4th September 2018
news_main1536037279.png-19935

 ముంబై: రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్‌ 30 నాటికి (ఆర్‌బీఐ అకౌంటింగ్‌ సంవత్సరం జూలై నుంచి జూన్‌ వరకు) ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 566.23 టన్నులకు చేరాయి. 2017 జూన్‌ నాటికి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివరి సారిగా 2009లో ఆర్‌బీఐ 200 టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి కొనుగోలు చేసింది. డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం వల్లే గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం నిల్వలు పెంచుకునేందుకు దారితీసినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలియజేస్తోంది. 



You may be interested

ఇక బ్యాంకుల చెంతనే ‘అంబుడ్స్‌మన్‌’

Tuesday 4th September 2018

ముంబై: బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. 10 బ్రాంచ్‌లకు మించి కార్యకలాపాలున్న వాణిజ్య బ్యాంకులన్నీ ఇకపై కచ్చితంగా అంతర్గత అంబుడ్స్‌మన్‌ను (ఐఓ) నియమించుకోవాలని సోమవారం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీని నుంచి రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌కు (ఆర్‌ఆర్‌బీ) మినహాయింపునిచ్చింది. ‘అంతర్గత అంబుడ్స్‌మన్‌కు మరిన్ని స్వతంత్ర అధికారాలను కల్పించడం, ఐఓ యంత్రాంగం విధి నిర్వహణ తీరుపై పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకుగాను

ఆగస్ట్‌లో పెరిగిన ట్రాక్టర్ల అమ్మకాలు

Tuesday 4th September 2018

న్యూఢిల్లీ/ముంబై: ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో ట్రాక్టర్ల విక్రయాలకు కలిసొచ్చింది. ఆగస్ట్‌ మాసంలో ట్రాక్టర్ల అమ్మకాల్లో మంచి వృద్ధి నెలకొంది. ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌)కు చెందిన సోనాలికా ట్రాక్టర్ల విక్రయాలు ఏకంగా 23.2 శాతం పెరిగాయి. 7,369 వాహనాలను విక్రయించింది. ఎగుమతులతో కలిపి 2017 ఆగస్ట్‌లో అమ్ముడుపోయిన ట్రాక్టర్లు 6,036 మాత్రమే. దీంతో పోలిస్తే విక్రయాలు 23.2 శాతం పెరిగాయి. ఈ కంపెనీ ట్రాక్టర్ల ఎగుమతులు క్రితం ఏడాది ఆగస్ట్‌లో

Most from this category