STOCKS

News


వ్యవస్థలోకి ఆర్‌బీఐ మరిన్ని నిధులు!

Friday 3rd January 2020
news_main1578021849.png-30632

  • ద్రవ్య లభ్యత పెంపునకు చర్యలు
  • 6న ఆర్‌బీఐ ప్రత్యేక ఓఎంఓ చర్యలు

ముంబై: తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంపునకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తసుకుంది. ఓపెన్‌మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంఓ) ద్వారా జనవరి 6న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, అమ్మకం చర్యలను చేపట్టనుంది. రూ.10,000 కోట్ల చొప్పున బాండ్ల కొనుగోలు, అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. అర్హులు తమ బిడ్స్‌, ఆఫర్లను జనవరి 6 ఉదయం 10.30 నుంచి 12.00 గంటల మధ్య  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ సిస్టమ్‌పై ఎలక్రా‍్టనిక్‌ ఫార్మేట్‌ రూపంలో సమర్పించవచ్చని గురువారం విడుదలైన ఆర్‌బీఐ ప్రకటన తెలిపింది. బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌సహా ఫైనాన్స్‌ సంస్థల్లోకి మరింత నిధులు పంప్‌ చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే బాండ్ల విక్రయ చర్య... వ్యయాలకు సంబంధించి కేంద్రానికి మరిన్ని నిధులు సమకూరడానికి దోహదపడుతుంది. ఇప్పటికే ఈ తరహా ఓఎంఓ చర్యలను రెండుసార్లు ఆర్‌బీఐ చేపట్టింది. 



You may be interested

పీఎస్‌బీల ‘ఈబిక్రయ్‌’

Friday 3rd January 2020

స్వాధీనం చేసుకున్న ఆస్తుల వేలానికి పోర్టల్‌ ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా అభివృద్ధి చేసిన ఏకీకృత పోర్టల్‌ ‘ఈబిక్రయ్‌’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రారంభించారు. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) చీఫ్‌లు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంకింగ్‌ రంగ అంశాలపై మంత్రి చర్చించారు. వ్యాపార రీత్యా వివేకంతో తీసుకునే నిర్ణయాలకు రక్షణ ఉంటుందన్న

మిస్త్రీ కేసులో సుప్రీం కోర్టుకు టాటా సన్స్‌

Friday 3rd January 2020

న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ టాటా సన్స్‌ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది.  చైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమన్న ఆదేశాలను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, టాటా సన్స్‌ను ప్రైవేట్ సంస్థగా మార్చడంలో తమ పాత్రను తప్పుపడుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాల్సిందిగా కోరుతూ

Most from this category