News


ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ ఒక్కటే కట్టడి చేయలేదు: రంగరాజన్‌

Monday 24th February 2020
news_main1582512360.png-32020

న్యూఢిల్లీ: ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) సమస్యను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాత్రమే కట్టడి చేయలేదని మాజీ గవర్నర్‌ సీ రంగరాజన్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడిలో కీలకమైన సరఫరాలో సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ‘నూతన ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్‌ - దాని అర్థం’’ అన్న చర్చాపత్రంపై ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరిమితుల గురించి మాట్లాడారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’ లేదా ‘మైనస్‌ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ‍ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో  రిటైల్‌ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్‌ (4.62 శాతం), డిసెంబర్‌ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని ఇప్పుడు దాటింది. ఆర్‌బీఐ పాలసీ విధానానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక.  ద్రవ్యోల్బణం కట్టడితోపాటు, వృద్ధి, ఫైనాన్షియల్‌ రంగం సుస్థిరత వంటి ఎన్నో బాధ్యతలను ఆర్‌బీఐ నెరవేర్చాల్సి ఉంటుందని రంగరాజన్‌ అభిప్రాయపడ్డం గమనార్హం. 



You may be interested

సీబీహెచ్ఎఫ్ఎల్‌లో 'సెంట్రల్ బ్యాంక్‌' వాటాల విక్రయం

Monday 24th February 2020

మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ముంబై: గృహ రుణాల వ్యాపార విభాగం సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ (సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో మొత్తం 64.4 శాతం వాటాల విక్రయంపై ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. షార్ట్‌లిస్ట్ అయిన సంస్థలు.. సీబీహెచ్ఎఫ్ఎల్‌లో సెంట్రల్ బ్యాంక్ వాటాలకు కొనుగోలుదారును వెతికిపెట్టాల్సి ఉంటుంది. "మా బ్యాంకు కూడా స్వయంగా గృహ

రిటైరైన తర్వాత అధిక రిస్క్‌ వద్దు..!

Monday 24th February 2020

ప్ర: నేను ఇండెక్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇవి ఈక్విటీ ఫండ్స్‌కంటే మంచి రాబడులనే ఇవ్వగలవా ? ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయోచ్చంటారా ?  -సుచరిత, హైదరాబాద్‌  జ: ఇండెక్స్‌ ఫండ్స్‌కు ఉండే ప్రధాన ప్రయోజనం.... వ్యయాలు తక్కువగా ఉండటం. ఇవి సూచీలను ప్రతిబింబిస్తాయి. సెన్సెక్స్‌ లేదా నిఫ్టీల రాబడులను మించి రాబడులను సా«ధించడమనేది ప్రతి ఇన్వెస్టర్‌ ఆశించే లక్ష్యాల్లో ప్రధానమైనది. ఈ లక్ష్యాన్ని అయితే ఇండెక్స్‌ ఫండ్స్‌తో సాధించలేం. ఇండెక్స్‌ ఫండ్స్‌కు

Most from this category