News


క్రమంగా జీఎస్‌టీ రేట్ల పెంపు?!

Thursday 2nd January 2020
news_main1577944677.png-30612

వస్తు సేవల పన్ను రేట్లను క్రమంగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకేసారి పన్ను రేట్లను పెంచితే కన్జూమర్లపై పెను భారం పడుతుందన్న ఆలోచనతో వీటిని క్రమంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. క్రమానుగత పెంపులో భాగంగా రేట్లను స్వల్పంగా పెంచడం, కొన్ని ఉత్పత్తులను అధిక శ్లాబులోకి దశలవారీగా మార్చడంలాంటి చర్యలను ప్రభుత్వం చేపట‍్టనుంది. ప్రస్తుత పన్ను నిర్మితిని పరిశీలించి, ఆదాయం పెంచుకునే సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్రాల అధికారులతో ఒక ప్యానెల్‌ను ఏర్పరిచింది. ప్యానెల్‌ సిఫార్సుల ఆధారంగా ప్రస్తుతం జీఎస్‌టీ నుంచి మినహాయింపు పొందుతున్న దాదాపు 150 ఉత్పత్తులను ప్రభుత్వం పునఃపరిశీలించనుంది. వచ్చే సమావేశంలో ప్యానెల్‌ సిఫార్సులను జీఎస్‌టీ కమిటీ చర్చిస్తుందని ఎకనమిక్‌ టైమ్స్‌ నివేదిక తెలిపింది. జీఎస్‌టీ ఫైలింగ్స్‌ను వెరిఫై చేసేందుకు బ్యాంకు అకౌంట్‌ వివరాలు కోరాలని అధికారులు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవే బిల్లులు, ఫాస్టాగ్‌ ద్వారా వస్తుసేవల కదలికలను ట్రాక్‌ చేయవచ్చని, బ్యాంకుల నుంచి వివరాలు సేకరించడం ద్వారా నిజమైన లావాదేవీలను ట్రాక్‌ చేయవచ్చని అధికారులు యోచిస్తున్నట్లు తెలిపాయి. 



You may be interested

ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌: మెటల్‌ షేర్ల మెరుపులు

Thursday 2nd January 2020

17శాతం పెరిగి హిందూస్థాన్‌ కాపర్‌ షేరు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య ఒప్పందం పురోగతి సాధిస్తుందనే అంచనాలో గురువారం మార్కెట్లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఏడాదిన్నరగా చైనాతో సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అడుగులు వేస్తుందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అందులో ఇటీవల చైనాతో కుదుర్చుకున్న తొలిదశ వాణిజ్య

బలరామ్‌పూర్‌ చినీ.. మరింత పెరుగుతుందా?

Thursday 2nd January 2020

2013 తదుపరి సరికొత్త గరిష్టానికి షేరు ఇటీవల కొద్ది రోజులుగా దూకుడు చూపుతున్న షుగర్‌ రంగ కౌంటర్‌ బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌ మరోసారి వెలుగులో నిలిచింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ. 2 పెరిగి రూ. 189 సమీపానికి చేరింది. ఇది 2013 మే తదుపరి గరిష్టంకావడం విశేషం! కాగా.. 10.32 ప్రాంతంలో క్రితం ముగింపు రూ. 187 సమీపంలో ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ

Most from this category