News


పరిమితి పెంపుతో వేగంగా రుణాల రికవరీ

Monday 24th September 2018
news_main1537766076.png-20510

న్యూఢిల్లీ: డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌కు (డీఆర్‌టీ) నివేదించదగ్గ మొండిబాకీల కేసుల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల వివరణనిచ్చింది. మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేగంగా రికవర్ చేసుకోవడానికి ఇది తోడ్పడగలదని పేర్కొంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాల రికవరీ చట్టం 1993ని సవరిస్తూ.. డీఆర్‌టీలో కేసు దాఖలుకు ఇటీవల పరిమితిని పెంచిన సంగతి తెలిసిందే. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతల నుంచి సొమ్మును రాబట్టే క్రమంలో చట్టాలు, తత్సంబంధ ప్రక్రియలను సరళం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. దీనివల్ల చిన్నా, చితక వాటిపై కంటే భారీ మొండిబాకీల కేసులపై డీఆర్‌టీలు దృష్టి పెట్టడానికి వీలవుతుందన్నారు.

38,376 కేసులు పెండింగ్‌
 జూన్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం డీఆర్‌టీల్లో రూ. 10- 20 లక్షల పరిమాణం గల కేసులు 38,376 పైచిలుకు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి వాటా 38 శాతం పైమాటే అయినప్పటికీ.. విలువపరంగా చూస్తే రికవర్ కావాల్సిన మొండి బాకీల్లో వీటి పరిమాణం 4 శాతమే. ఇటీవల రూ.20 లక్షల లోపు ఎన్‌పీఏల కేసుల వాటా 41 శాతానికి పెరిగిందని రాజీవ్ కుమార్ తెలిపారు. నిర్దేశిత 60 రోజుల్లోగా మొండిబాకీ కేసు విచారణ పూర్తి చేసి, డిఫాల్ట్ అయిన రుణగ్రహీతల ఆస్తులను జప్తు చేసే ప్రక్రియపై జిల్లా మేజిస్ట్రేట్‌లు మరింతగా దృష్టి పెట్టేలా చూడాలంటూ రాష్ట్రాలకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ సూచించినట్లు ఆయన వివరించారు. జిల్లా మేజిస్ట్లేట్‌ న్యాయస్థానాల్లో రూ. 40,000 కోట్ల బకాయిలకు సంబంధించి 10,000 పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. వేలం ప్రక్రియను మరింత మెరుగుపర్చే క్రమంలో ఈ-ఆక్షన్ బజార్‌ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ వివరించారు. 



You may be interested

ఇన్వెస్టర్లూ... ఇలా చేయొద్దు!!

Monday 24th September 2018

‘‘గత ఏడాది కాలంలో మార్కెట్లు 20 శాతం ర్యాలీ చేశాయి. కానీ, నేను ఇన్వెస్ట్‌ చేస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకం మాత్రం నష్టాలనే  చూపిస్తోంది’’ ఇదీ... ఢిల్లీకి చెందిన తరుణ్‌ ఆవేదన. మరి తరుణ్‌ విషయంలో ఏమై ఉంటుందని పరిశీలిస్తే... అతడు 2017 జులై నుంచి ప్రతి  నెలా ఓ లార్జ్‌క్యాప్‌ పథకంలో రూ.10,000, ఓ మిడ్‌క్యాప్‌ పథకంలో రూ.10,000 చొప్పున సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తున్నాడు. లార్జ్‌

గృహ రుణం ముందే తీరిస్తే లాభమేనా ? 

Monday 24th September 2018

ప్ర: నేను ఏడాది క్రితం డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో రూ. 2 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. ఇతర స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్‌ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్‌ నుంచి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని కెనరా రెబొకో లేదా రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. లేదంటే  డీఎస్‌పీ స్మాల్‌ క్యాప్‌ఫండ్‌ నుంచి వెనక్కి తీసుకున్న మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా చేసి,

Most from this category