News


ఆర్‌బీఐ స్వతంత్రతకు రాహుల్‌ బజాజ్‌ బాసట

Friday 16th November 2018
news_main1542348881.png-22090

ముంబై: ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తికి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ బాసటగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఉపయోగించని సెక్షన్‌ 7 ద్వారా తన నిర్ణయాలను ఆర్‌బీఐపై రుద్దే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు. ఈ నెల 19న జరిగే ఆర్‌బీఐ భేటీ సందర్భంగా ఆర్‌బీఐ, ప్రభుత్వం తమ మధ్య దూరాన్ని తొలగించుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సెక్షన్‌ 7ను ప్రభుత్వం ప్రయోగిస్తే, గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘‘ప్రభుత్వం తన నిర్ణయాలకే కట్టుబడి ఉంటే విషయం వెడెక్కుతుంది. ఆర్‌బీఐ లేదా ఉర్జిత్‌ పటేల్‌ కూడా తమ వాదనకే కట్టుబడి ఉంటే, ప్రభుత్వం సెక్షన్‌ 7ను ప్రయోగించినట్టయితే... పటేల్‌ రాజీనామా చేస్తారని అనుకుంటున్నా’’ అని రాహుల్‌ బజాజ్‌ పేర్కొన్నారు. గురువారం ముంబైలో జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డుల కార్యక్రమం సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు వర్గాలు అంగీకారానికి వస్తే సెక్షన్‌ 7ను ప్రయోగించాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ‘ఒకవేళ వారు వినకపోతే, మీరు వినండి’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను ఉద్దేశించి అన్నారు. పటేల్‌ కనీసం తన విధానంపై నిలబడ్డారని... రఘురామ్‌ రాజన్‌ అనంతరం పటేల్‌ ఆ స్థానంలో విజయం సాధించారని ప్రశంసించారు. 
ఆర్‌బీఐ కూడా మినహాయింపులు చూడాలి
‘‘రెండు ప్రధాన వివాదాస్పద అంశాలైన చిన్న వ్యాపారాలకు నిధులు, 11 ప్రభుత్వరంగ బ్యాంకులపై స్పష్టమైన దిద్దుబాటు కార్యాచరణను సరళీకరించాలనే విషయంలో ఆర్‌బీఐ తప్పకుండా మినహాయింపులు చూడాలి’’ అని రాహుల్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. సెంట్రల్‌ బ్యాంకు స్వతంత్రత అన్నది ప్రధానమైనదన్నారు. ప్రపంచంలో ఎక్కుడా సెంట్రల్‌ బ్యాంకు స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ కోసం ఎవరూ వివాదానికి పోలేదన్నారు. ‘‘ఎన్నికైన పార్లమెంటు అత్యున్నతమైనది. సెక్షన్‌ 7ను ప్రయోగించడంపై చర్చ జరుగుతోంది. కానీ, ఆర్‌బీఐ 83 ఏళ్ల చరిత్రలో దీన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు’’ అని రాహుల్‌ బజాజ్‌ అన్నారు. 

ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య వివాదం మంచిది కాదు
కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ బ్యాంకు మధ్య వివాదం మంచిది కాదని ఆర్‌బీఐ బోర్డు సభ్యుడు ఎస్‌ గురుమూర్తి అన్నారు. పలు అంశాలపై ఇటీవల కేంద్రం, ఆర్‌బీఐ మధ్య పొరపొచ్చాలు వచ్చిన నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... మొండి బకాయిల విషయంలో ప్రొవిజన్లకు సంబంధించి కఠిన నిబంధనలను బ్యాంకులపై రుద్దడం వల్ల బ్యాంకింగ్‌ రంగంలో సమస్యలకు దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బేసెల్‌ క్యాపిటల్‌ అడెక్వెసీ నిబంధనల్లో పేర్కొన్న పరిధికి మించి భారత్‌ వెళ్లకూడదన్నారు. You may be interested

యస్‌ బ్యాంక్ సెర్చి కమిటీ నుంచి భట్ రాజీనామా

Friday 16th November 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ కొత్త సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన సెర్చి కమిటీ నుంచి ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ఓపీ భట్ తప్పుకున్నారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి రుణాల వివాదానికి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సెర్చి కమిటీలో తన పాత్ర వివాదాస్పదం కావొచ్చనే ఉద్దేశంతో ఆయన వైదొలిగినట్లు యస్‌ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో రాణా కపూర్ స్థానంలో

టెలికం టవర్లు @ 5 లక్షలు

Friday 16th November 2018

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం 5 లక్షల టవర్లను ఏర్పాటు చేశాయి. ఈ 5 లక్షల మొబైల్‌ టవర్ల ఏర్పాటు కోసం టెలికం కంపెనీలు రూ.10.44 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. ఒక్కో మొబైల్‌ టవర్‌ వివిధ టెలికం కంపెనీల బేస్‌ స్టేషన్లుగా (బీటీఎస్‌) కార్యకలాపాలు నిర్వహిస్తాయని, మొత్తం బేస్‌ స్టేషన్ల సంఖ్య 20 లక్షలకు చేరిందని

Most from this category