News


డీమోనిటైజేషన్‌ స్థాయికి క్యూ2 రుణ వృద్ధి

Tuesday 12th November 2019
news_main1573583334.png-29536

దేశ ఆర్థిక వృద్ధి రికవరీకి ఇంకా చాలా సమయమే పడుతుందన్న దానికి నిదర్శంగా ఒకవైపు ఆటో అమ్మకాలు బలహీనంగా ఉండగా, మరోవైపు జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రుణాల వృద్ధి 6 శాతానికి తగ్గి, తిరిగి డీమోనిటైజేషన్‌ కనిష్టానికి చేరింది. ఈ విషయాన్ని క్రెడిట్‌సూసే ఒక నివేదిక ద్వారా తెలియజేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రుణాల వృద్ధి 6 శాతంగా ఉందని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో రుణాల వృద్ధి తిరిగి గాడిన పడిందని, వార్షికంగా చూసుకుంటే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 36 శాతం వృద్ధి ఉందని, అదే బ్యాంకుల్లో రుణాల వృద్ధి ఇంకా పూర్వపు స్థితికి చేరలేదని, 8 శాతంగా ఉందని వెల్లడించింది. ‘‘ప్రైవేటు బ్యాంకులలోనూ రుణాల వృద్ధి గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం నుంచి 14 శాతానికి తగ్గింది. ప్రభుత్వం నుంచి మూలధన నిధుల సాయం ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వృద్ధి 8 శాతం నుంచి 5 శాతానికి క్షీణించింది’’ అని క్రెడిట్‌సూసే నివేదిక తెలియజేసింది.

 

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన అనంతరం ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా కానీ, బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు రుణాల విషయంలో ఇప్పటికీ పునరాలోచనతో ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘ఎన్‌బీఎఫ్‌సీలకు ఇప్పటికీ నిధుల లభ్యత పరంగా సమస్యలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే రుణాల ఎక్స్‌పోజర్‌ను 30 శాతం వరకు తగ్గించుకున్నాయి. చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ ఎక్స్‌పోజర్‌ వాటి రుణ పుస్తకంలో 10-15 శాతం వరకు ఉంది’’ అని క్రెడిట్‌సూసే నివేదిక తెలియజేసింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు సమస్యలు ఇంకా ముగిసిపోలేదని, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల సమీకరణ విషయంలో అవి సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. 
 



You may be interested

పీఈ సంస్థల్లేని ఐపీవోలు అదుర్స్‌!

Wednesday 13th November 2019

ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? లిస్టింగ్‌ లాభాలను ఆర్జిస్తున్నారా..?.. అవును అంటే మీరు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. ప్రైవేటు ఈక్విటీ సంస్థల మద్దతుతో వచ్చే ఐపీవోలతో పోలిస్తే పీఈ మద్దతులేని ఐపీవోలు లిస్టింగ్‌ రోజున అధిక లాభాలను ఇస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కంపెనీల ఫండమెంటల్స్‌ కూడా ఇక్కడ పనిచేయడం లేదు!   2018-19, అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో గణాంకాలను పరిశీలించినట్టయితే.. పీఈ మద్దతుగల 39 కంపెనీలు లిస్టింగ్‌

ఇన్ఫోసిస్‌ సీఈఓపై మరో ఫిర్యాదు

Tuesday 12th November 2019

  కంపెనీ లాభాలను ఎక్కువ చేసి చూపేందుకు అనైతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారని, ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై తాజాగా వచ్చిన విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదు మరవకముందే, మరోక విజిల్‌ బ్లోయర్‌ ఈ సీఈఓకు వ్యతిరేకంగా కంపెనీ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలకేని, ఇతర స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాశారని ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ సోమవారం పేర్కొంది. ‘ఇన్ఫోసిస్‌ సీఈఓగా సలీల్‌ పరేఖ్‌ 20 నెలల కిందట నియమితులయ్యారు. నియమావళి ప్రకారం

Most from this category