News


విదేశాంగ శాఖకు రూ.16 వేల కోట్లు!

Saturday 2nd February 2019
news_main1549101943.png-23973

  • మాల్దీవులతోపాటు ఆఫ్రికాకు పెరగనున్న సాయం

న్యూఢిల్లీ: 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. ఇందులో ఎంతో వ్యూహాత్మకమైన మాల్దీవులతోపాటు ఆఫ్రికా దేశాలకు అందజేసే సాయం భారీగా పెరిగింది. గత బడ్జెట్‌లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. దీన్లో మాల్దీవులకు అందజేసే సాయం రూ.125 కోట్ల నుంచి అమాంతం రూ.575 కోట్లకు పెరిగింది. దీంతోపాటు ఇరాన్‌లోని వ్యూహాత్మకమైన చాబహార్‌ నౌకాశ్రయం అభివృద్ధికి గత ఏడాది బడ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా రూ.150 కోట్లే ప్రత్యేకించింది. భూటాన్‌కు సాయం గత ఏడాది రూ.2,650 కోట్లు కాగా ఈసారి దానిని రూ.2,615 కోట్లకు తగ్గించింది. ఇంకా.. అఫ్గానిస్తాన్‌కు రూ.325 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.175 కోట్లు, శ్రీలంకకు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.5 కోట్లు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది. నేపాల్‌కు కూడా గత ఏడాది కంటే రూ.50 కోట్లు ఎక్కువగా రూ.700 కోట్లు, మయన్మార్‌కు రూ.280 కోట్ల నుంచి రూ.400 కోట్లకు కేటాయింపులను పెంచింది. అదేవిధంగా ఆఫ్రికా దేశాలకు, మారిషస్‌కు అందించే సాయాన్ని దాదాపు రెట్టింపు చేస్తూ వరుసగా రూ.400 కోట్లు, రూ.700 కోట్లు కేటాయించింది. విదేశాంగ శాఖకు ఎస్టాబ్లిష్‌మెంట్‌ వ్యయం కింద రూ.5,137.95 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ ముఖ్యులు ప్రయాణించే ఎయిరిండియా విమాన నిర్వహణ ఖర్చుల కోసం 2018-19 సంవత్సరాల్లో రూ.420 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా విదేశాంగ శాఖకు 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో రూ.16,061 కోట్లు అంటే గత ఏడాది బడ్జెట్‌ కంటే రూ.1,050 కోట్లు పెంచింది.



You may be interested

డిప్రెషన్‌ లో మోదీ ప్రభుత్వం: మమతా బెనర్జీ

Saturday 2nd February 2019

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించడాన్ని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. కేంద్రం చేసిన ప్రకటనలకు ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు. కోల్‌కతాలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ..‘లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వం కూడా మధ్యంతర బడ్జెట్‌లో పూర్తిస్థాయి పథకాలను ప్రకటించేందుకు వీల్లేదు. ఎందుకంటే ఈ పథకాలను ఎవరు

స్ర్తీ, శిశు సంక్షేమానికి 20శాతం అధిక నిధులు

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 29164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను

Most from this category